విశాఖపట్నం- విశాఖ సందేశం -క్లిష్ట పరిస్థితుల్లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారంచుట్టి భారత అభివృద్ధి దిశను మార్చిన దురంధరుడు పీవీ నరసింహారావు అని డాక్టర్ జహీర్ అహ్మద్ అన్నారు.విశాఖపట్నం వివేకానంద ఆశ్రమంలో ఆదివారం విశాఖ సందేశం పేపర్ అధినేత కేవీ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన పీవీ 105 వ జయంతి కార్యక్రమంలో డాక్టర్ జహీర్ అహ్మద్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. జర్నలిస్టులు కొణతాల శ్రీనివాసరావు, వీఎస్ జగన్మోహన్,రాఘవేంద్ర మిశ్రా,ఎన్ రవిశంకర్,ధవళేశ్వరపు రవికుమార్, ఎన్ అరుణ్ భాస్కర్(హరి),కపిల్ అగర్వాల్,సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముందుగా పీవీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి ఆశ్రమంలో వసతి పొందుతున్న వృద్ధుల సమక్షంలో జహీర్ అహ్మద్ కేక్ కట్ చేసారు.
అనంతరం వృద్దులకు పళ్ళు,రొట్టెలు,దుప్పట్లు పంపిణీ చేసారు.చివరిగా సుమారు వందమంది నిరుపేదలకు అన్నదానం చేసారు.ఈ సందర్భంగా జహీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రధానమంత్రిగా, ఆర్థికవేత్తగా ఎన్నో సంస్కరణలను అమలులోకి తీసుకువచ్చి దేశాభివృద్ధికి విశేష కృషి చేసిన భారతరత్న పీవీ నరసింహారావు అని కొనియాడారు.కొణతాల శ్రీనివాస్ మాట్లాడుతూ రాజనీతిజ్ఞుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన పీవీ నరసింహారావు తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. భారత అభివృద్ధి దిశను మార్చిన మహానేత పీవీ నరసింహారావు అని కొనియాడారు.



Comments
Post a Comment