. K.V.SHARMA EDITOR
విశాఖపట్నం --విశాఖ సందేశం వార్తలు -విశాఖలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 105 జయంతి కార్యక్రమం ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. విశాఖ బ్రాహ్మిణ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గవర్నర్ బంగ్లా ఎదురుగా గల పీవీ విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.విశాఖ ఎంపీ ఎం శ్రీ భరత్, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ,రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు,ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు,మాజీ ఎంపీ పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్,వైస్సార్ సీపీ యువనేత ద్రోణంరాజు శ్రీవాత్సవ తదితరులు పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం శ్రీ పీవీ నరసింహారావు జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో దసపల్లా హోటల్ లో వేలాదిమంది బ్రాహ్మణ సామాజికవర్గం సమక్షంలో అంగరంగ వైభవంగా పీవీ జయంతి కార్యక్రమం నిర్వహించారు.రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విశాఖ ఎంపీ ఎం శ్రీ భరత్,అతిధులుగా మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ,ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్,ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సీతంరాజు సుధాకర్,బీజేపీ అధికారప్రతినిధి సుహాసిని ఆనంద్,యువనేత ద్రోణంరాజు శ్రీవాత్సవ, పివి కి ఎస్ డి ఓ గా పనిచేసిన ప్రసాద్ తదితరులు హాజరై పీవీ చిత్రపటానికి పూలమాలలు అలంకరించి నివాళులర్పించారు.
ముఖ్య అతిధి ఎం శ్రీ భరత్ మాట్లాడుతూ భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో ప్రధానమంత్రిగా పీవీ బాధ్యతలు చేపట్టి సాహసోపేతంగా ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలతో దేశ దశను మార్చిన ఆధునిక భారతదేశ ఆర్థిక సంస్కర్త అని కొనియాడారు. సాధారణ రైతు కుటుంబం నుంచి ప్రపంచం మెచ్చిన ఆర్థిక సంస్కరణల మేధావిగా ఎదిగిన పీవీ స్ఫూర్తిగా నేటి యువతరం ఎదగాలని కోరారు.బొత్స ఝాన్సీ మాట్లాడుతూ పీవీ ఆశయాలు,విలువలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ భారత కీర్తిపతాకను ప్రపంచ స్థాయిలో నిలిపిన పీవీ నరసింహారావు జయంతిని, వర్ధంతిని ప్రభుత్వం అధికారంగా జరపాలని కోరారు.
ప్రధానమంత్రి గా, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా చేసిన ఏకైక తెలుగు వ్యక్తి పీవీ అని,ఈయన దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత రత్న పురస్కారం ఇచ్చి గౌరవించిన ప్రభుత్వం మాత్రం భారతీయ జనతా పార్టీ అన్నారు. రాజకీయంగా ప్రత్యర్థి ఐనప్పటికీ పీవీ కు అత్యున్నత పురస్కారం భారత రత్న ఇచ్చి గౌరవించినట్లు తెలిపారు.16 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన నేర్పరిఅని బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నేటి తరానికి మార్గదర్శి అన్నారు. పీవీ నరసింహారావు వద్ద ప్రత్యేక అధికారిగా ఆరేళ్ళు పనిచేసిన ప్రసాద్ మాట్లాడుతూ పీవీ జీవన శైలి, ఆలోచన, కార్యాచరణ విధానాలు వివరించారు. ప్రతిపక్ష నేతలైన అటల్ బిహారి వాజపేయి, అద్వానీ, ఇతర ముఖ్య నేతలు అందరితోనూ స్నేహ పూర్వక అనుబంధాన్ని కొనసాగించారని తెలిపారు. తన సొంత భూమి 80 ఎకరాలను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించారని తెలిపారు.ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్, సీతంరాజు సుధాకర్, సుహాసిని ఆనంద్, బొత్స ఝాన్సీ, ద్రోణంరాజు శ్రీవాత్సవ తదితరులు పీవీ దేశానికి చేసిన సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పీవీ జయంతి వేడుకల కమిటీ చైర్మన్ కె నరసింహ మూర్తి,కన్వీనర్ చెరువు రామకోటయ్య, వేదుల హనుమంత రావు, రాచకొండ దశరథ రామయ్య,గంటి రవికుమార్, చరణ్ కుమార్, శివ గణేష్ శర్మ,గాడేపల్లి ప్రభాకర శాస్త్రి, వేదుల రామకృష్ణ, నేరెళ్ళ కామేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment