Skip to main content

గ్రీన్ వైజాగ్ – హెల్తీ వైజాగ్ దిశగా జీవీఎంసీ ప్రత్యేక కార్యాచరణ. * అన్ని జోన్లలో రూ.10.97 కోట్లతో 60 థీమ్ పార్కుల అభివృద్ధి. *ప్రతి సోమవారం "సైక్లింగ్ డే" అమలుకు జీవీఎంసీ అధికారిక సూచనలు. *బీచ్ ఫ్రంట్, సిటీ సైక్లింగ్ ట్రాక్‌ల ఏర్పాటుకు చర్యలు. *నగరంలో హెరిటేజ్ వాకింగ్ ట్రాక్ అభివృద్ధి. *ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, వారసత్వ సంపద అభివృద్ధే లక్ష్యం. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.

                       K.V.SHARMA EDITOR 


విశాఖపట్నం, జూన్ 12: విశాఖ నగరాన్ని పచ్చదనం, ఆరోగ్యకర జీవనశైలి, పర్యావరణహిత రవాణా, వారసత్వ పరిరక్షణకు ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పలు వినూత్న కార్యక్రమాలను చేపడుతోందని ,ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, సామాజిక భాగస్వామ్యం, వారసత్వ ప్రదేశాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నదని ఆ దిశగా నగరంలో 60 థీమ్ పార్కులు, సైకిలింగ్ ట్రాక్ లు, హెరిటేజ్ వాకింగ్ ట్రాక్ ను అభివృద్ధి పరచడం జరుగుతున్నదని  జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.



1) రూ.10.97 కోట్లతో 60 థీమ్ పార్కుల అభివృద్ధి: 

జీవీఎంసీ పరిధిలో గల అన్ని జోన్లలో ప్రస్తుతం మొత్తం 174 పార్కులు ఉండగా, వాటిలో 151 ఎకరాల విస్తీర్ణంలో 139 కాలనీ పార్కులు ఉన్నాయని, వాటిలో మరింత అభివృద్ధి అవసరమున్న 60 పార్కులను గుర్తించి ఆరు ప్యాకేజీలుగా విభజించి, మొత్తం రూ.10.97 కోట్ల (రూ.1097.41 లక్షలు) అంచనా వ్యయంతో ప్రత్యేక థీమ్ పార్కులుగా అభివృద్ధి చేయనున్నామన్నారు .ప్రతి పార్కుకు ప్రత్యేక థీమ్ తో  అనగా ప్రకృతి (Nature Theme),సాహస క్రీడలు (Adventure Theme),ఫిట్‌నెస్ (Fitness Theme),చిన్నారుల వినోదం (Children's Theme),ఇతర ప్రత్యేక అంశాలతో కూడిన థీమ్‌లు ఉంటాయన్నారు. అలాగే ఈ థీమ్ పార్కులు సుందరమైన ఉద్యానవనాలు, పుష్పవాటికలు,నడక, జాగింగ్ ట్రాక్‌లు,థీమ్ ఆధారిత చిన్నారుల ఆట పరికరాలు,ఓపెన్ జిమ్‌లు,యోగా జోన్‌లు,సాంస్కృతిక, విద్యా ప్రదర్శనలు,శిల్పాలు, మ్యూరల్స్, సమాచార బోర్డులు, ఫౌంటైన్లు ,నీటి అందాల ఏర్పాట్లు,ఆర్‌సీసీ బెంచీలు, సీటింగ్ అండ్ రెస్ట్ ఏరియా,సీసీటీవీ పర్యవేక్షణ,సౌర విద్యుత్ ఆధారిత లైటింగ్,తాగునీటి సదుపాయం,మరుగుదొడ్లు,విద్యుత్ దీపాలంకరణ, మొక్కలకు నీటి సరఫరా సదుపాయం. అలాగే వర్షపు నీటి సంరక్షణ ,పునర్వినియోగ పదార్థాల వినియోగం,స్థానిక, తక్కువ నీటితో పెరిగే మొక్కల నాటకం,పర్యావరణ పరిరక్షణకు అనుకూల చర్యలతో ఈ థీమ్ పార్కులను అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు.

2) నగరంలో ప్రతి సోమవారం "సైక్లింగ్ డే"

ప్రజల ఆరోగ్య పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఇంధన పొదుపు లక్ష్యాలతో జీవీఎంసీ పరిధిలో ప్రతి సోమవారాన్ని "సైక్లింగ్ డే"గా స్వచ్ఛందంగా ఆచరించాలని నిర్ణయించామన్నారు.అన్ని శాఖాధిపతులు (HODs), జోనల్ కమిషనర్లకు అధికారిక సలహా జారీ చేసామని,అధికారులు, ఉద్యోగులు కార్యాలయాలకు వీలైనంత మేర సైకిళ్లపై రావాలని సూచించామన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలుకూడా స్వచ్ఛందంగా ఆచరించాలని , సైక్లింగ్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటం, మానసిక ఉల్లాసం పెరగడం, ఊబకాయం తగ్గడం , కాలుష్య నియంత్రణ, ఇంధన పొదుపు వంటి ప్రయోజనాలు కలుగుతాయని కమిషనర్ తెలిపారు.


ట్రాక్‌లు3) విశాఖ నగరంలో ప్రత్యేక సైకిల్  : 

విశాఖ నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, ఆహ్లాద వాతావరణానికి , కాలుష్య నియంత్రణకు సాగర్‌నగర్ బీచ్ సమీపంలో బీచ్ ఫ్రంట్ సైకిల్ ట్రాక్ 10 అడుగులు వెడల్పు గల700 మీటర్లు పొడవునా సుమారు రూ.2 కోట్ల తో సైక్లింగ్ ట్రాక్

సిటీ సైకిల్ ట్రాక్ అభివృద్ధి కి, అలాగే ఆరిలోవ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ పరిసర ప్రాంతంలో 2.70 మీటర్లు వెడల్పుతో 5.20 కిలోమీటర్లు పొడువునా సుమారు రూ 3 కోట్లతో సైక్లింగ్ ట్రాక్ లను అభివృద్ధికి ప్రతిపాదిస్తూ నగరంలో సైక్లింగ్ సంస్కృతిని ప్రోత్సహించేలా రూపకల్పన చేసామన్నారు. 

4) నగరంలో హెరిటేజ్ వాకింగ్ ట్రాక్ అభివృద్ధి:

విశాఖ నగర వారసత్వ సంపదను ప్రజలకు చేరువ చేయడానికి జీవీఎంసీ దక్షిణ జోన్‌లో హెరిటేజ్ వాకింగ్ ట్రాక్  ను పూర్ణా మార్కెట్ నుండి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వరకు 1.20 కిలోమీటర్లు పొడవునా 7.5 అడుగులు వెడల్పుత రూ.42 లక్షలు హెరిటేజ్ వాకింగ్ ట్రాక్ ను అభివృద్ధి పనులు పూర్తి చేశామని,

హెరిటేజ్ వాకర్ల సౌకర్యార్థం సూచిక బోర్డులు, ట్రాక్ మొత్తం మార్గంలో దిశా నిర్దేశక బోర్డులు,వాహనాల అక్రమ పార్కింగ్ నివారణకు "నో పార్కింగ్" బోర్డులు

వారసత్వ ప్రదేశాల ప్రాధాన్యాన్ని తెలియజేసే సమాచార  విషయాలతో అభివృద్ధిపరిచి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కమిషనర్ తెలిపారు.


విశాఖ నగర పచ్చదనం, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, వారసత్వ సంపద అభివృద్ధి పరస్పర అనుబంధ అంశాలు. విశాఖ నగరాన్ని నివసించడానికి అనువైన, ఆరోగ్యవంతమైన, స్ఫూర్తిదాయకమైన నగరంగా తీర్చిదిద్దడం జీవీఎంసీ లక్ష్యం అన్నారు. థీమ్ పార్కులు, సైక్లింగ్, హెరిటేజ్ వాకింగ్ వంటి కార్యక్రమాలలో అధికారులు, ఉద్యోగులు, ప్రజలందరూ భాగస్వాములు కావాలని ,ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకుని గ్రీన్ వైజాగ్ – హెల్తీ వైజాగ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నామని ఈ సందర్భంగా కమిషనర్ పిలుపునిచ్చారు.

పౌర సంబంధాల అధికారి, జివిఎంసి

Comments