ఈ రోజు అనగా తేది. 11.06.2026 న జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం జిల్లా స్థాయి మల్టీ మెంబెర్ అప్ప్రోప్రియేట్ అథారిటీ మరియు జిల్లా స్థాయి ఎడ్వైజరీ కమిటీ సంయుక్త సమావేశం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీ ఎం.అభిషిక్త్ కిషోర్ వారు మాట్లాడుతూ జిల్లాలో గల అన్ని స్కానింగ్ కేంద్రములు సందర్శించి స్కానింగ్ చేసే డాక్టర్స్ యొక్క విద్యార్హతలు మరియు సెంటర్ యొక్క డాక్యుమెంట్స్ పరిశీలన చేయాలని మరియు స్కానింగ్ కేంద్రం వారు ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన దరఖాస్తు ను పూర్తిగా పరిశీలించి పర్మిషన్ ఇవ్వాలని సూచించారు. జిల్లా వెబ్సైటు లో స్కానింగ్ కేంద్రముల వివరములు మరియు చెక్ లిస్టును పొందుపరచాలని ఆదేశించారు. మరియు తిరస్కరించిన అప్లికేషను పూర్తీ వివరములతో సమర్పించాలని ఆదేశించారు. పోలీస్ శాఖ వారి సహాయంతో డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించాలని తెలియచేసారు. మీటింగ్ మినిట్స్ లిస్టు తో చెక్ లిస్టు ను కూడా జతచేయాలని ఆదేశించారు. కమీషనర్ అఫ్ పోలీస్ వారు సమావేశానికి హాజరు కాలేని పక్షంలో తమ తర్వాత స్థాయి అధికారిని నామినేట్ చేసి పంపించాలని తెలియచేసారు. మరియు అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ వారికీ అనువైన సమయంలో శనివారం సమావేశం నిర్వహించేలా ఏర్పాటు చేసుకోవాలని తెలియచేసారు. లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం అనే పోస్టర్లను అన్ని స్కానింగ్ కేంద్రముల వారు తప్పనిసరిగా పేషెంట్ వెయిటింగ్ హాల్, స్కానింగ్ రూం బయట, స్కానింగ్ రూం లోపల ప్రదర్శించాలని ఆదేశించారు. 5% ఉచిత స్కాన్స్ అన్ని ప్రైవేటు స్కానింగ్ కేంద్రముల (క్లినిక్స్/ల్యాబ్లు/హాస్పిటల్స్) నందు విధిగా చేయాలని మరియు ఆ వివరాలను రిజిష్టర్ లో నమోదు చేస్తూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం లో విధిగా సమర్పించాలని ఆదేశించారు మరియు రెన్యువల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన వారు నెల మొత్తం లో గర్భిణీ స్త్రీలకు సంబందించిన చేసిన స్కాన్స్ లో 5% ఉచిత స్కాన్స్ వివరములు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయంలో సమర్పించి రెన్యువల్ రిజిస్ట్రేషన్ పొందాలని ఆదేశించారు. మరియు లింగ నిర్ధారణ చట్ట రీత్యా నేరమని ఈ విషయం లో అన్ని డిపార్ట్మెంట్స్ వారు సహకరించాలని సమావేశములలో పాల్గొని అవగాహన కలగచేయాలని పురుషునితో సమానంగా స్త్రీ యొక్క నిష్పత్తిని పెంచాలని కోరారు.
ఈ సమావేశంలో డా.ఐ.వాణి, సూపరింటెండెంట్, KGH, డా.సౌమిని, గైనకాలజిస్ట్, డా.రత్నకుమారి, పిడియాట్రిక్స్, డా.సుష్మ. రేడియోలజిస్ట్, KGH, డా.లూసీ, DIO, శ్రీ పి.రమేష్ బాబు, ఎన్.జి.ఓ, శ్రీమతి అరుణ ప్రియాన్శిక, ఎన్.జి.ఒ, డెమో శ్రీ బి.నాగేశ్వర రావు గారు, శ్రీ శ్రీనివాస రావు, సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్, శ్రీ ఎం.కిషోర్, ఎ.పి.ఆర్.ఒ. డెమో విభాగ సిబ్బంది, పాల్గొన్నారు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం



Comments
Post a Comment