రోజు అనగా తేది. 11.06.2026 న జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన ఏ.ఆర్.టి మరియు సరోగసి చట్టం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారు మాట్లాడుతూ ఏ.ఆర్.టి లెవెల్-1 కొరకు కింగ్ జార్జ్ హాస్పిటల్, నిర్మల హాస్పిటల్, శ్రీ వెంకటరమణ హాస్పిటల్ వారు దరఖాస్తు చేసుకున్నారని తెలియచేశారు.
జిల్లా కలెక్టర్ వారు హాస్పిటల్ వారితో మాట్లాడుతూ కమిటీ సభ్యులు సమావేశానికి హాజరు కావాలని, మరియు జిల్లా లో గల అన్ని లెవెల్-1, లెవెల్-2, ఎ.ఆర్.టి బ్యాంకులు మరియు సరోగసి కేంద్రముల వివరములు కాంటాక్ట్ నంబర్స్ మరియు ప్రతీ కేంద్రం యొక్క చెక్ లిస్టు సహా జిల్లా వెబ్సైటు లో పొందుపరచాలని ఆదేశించారు. ప్రతీ రెండు నెలలకు కమిటీ సమావేశం నిర్వహించాలని,
ఈ సమావేశంలో డా.సౌమిని, గైనకాలజిస్ట్, డా.రత్నకుమారి, పిడియాట్రిక్స్, శ్రీమతి ఎల్.వి.రమణి, ఎన్.జి.ఒ, డా.ఎ.నిర్మల, మెంబర్, డెమో శ్రీ బి.నాగేశ్వర రావు గారు మరియు డెమో విభాగ సిబ్బంది, పాల్గొన్నారు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం



Comments
Post a Comment