Skip to main content

నరేంద్ర మోడీ గారి సాధ్యంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా దేవాలయాలలో నరేంద్ర మోడీ గారి శ్రేయస్సు కొరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది.

                 K.V.SHARMA EDITOR 

సింహాచలం :విశాఖ సందేశం :10 జూన్ ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ ఏమ్ ఏమ్ ఎన్ పరశురామరాజు గారి ఆధ్వర్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి  దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

 ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  ఏపీ బీజేపీ చీఫ్ శ్రీ పివిఎన్ మాధవ్ గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా అత్యధిక కాలం పరిపాలన చేసిన నాయకుడిగా చరిత్ర సృష్టించారని అన్నారు.

 ఇప్పటివరకు మాజీ ప్రధాని నెహ్రూ గారు దేశాన్ని ఎక్కువ రోజులు పరిపాలించిన నేతగా ఉన్నారు.

 ప్రజల చేత ఎన్నుకోబడి 4399 రోజులు ప్రధానమంత్రిగా దేశ చరిత్రలో రికార్డు సృష్టించారని పేర్కొన్నారు.

 గుజరాత్ ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా 25 సంవత్సరాలు పాటు ప్రజాసేవలో ఉండి, ఏటువంటి అవినీతి మరక అంటుకోలేనటువంటి నేతగా పరిపాలన సాగించారని అన్నారు.


దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా, ప్రపంచానికి భారత్ ను విశ్వ గురువుగా పరిచయం చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు.

ఇప్పటివరకు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు అని తెలియజేశారు.

 ఆర్థిక రంగంలో, విద్యా రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి వాటి ద్వారా మహిళ,రైతు,యువతకు విభిన్న రంగాలలో సమాన అవకాశాలు సృష్టించారు.

 ప్రపంచ దేశాలు యుద్ధాలతో సతమతమవుతున్న వాటి ప్రభావం దేశ ప్రజలపై పడకుండా, వాటిని అవకాశాలు గా మలిచారు అని అన్నారు.

 ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ గారు  చెప్పినట్టుగా సప్తపదలను ప్రజలందరూ తప్పనిసరిగా ఆచరించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులు వినియోగించాలని,పెట్రోల్,డీజిల్ వాడకాన్ని తగ్గించాలని,సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని, వంట నూనె వాడకాన్ని తగ్గించాలని సంవత్సరం పాటు బంగారం కొనుగోలు వాయిదా వేయాలని  విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని  వర్క్ ఫ్రొం ఫోన్ ఆన్లైన్ మీటింగ్ ప్రోత్సహించాలని

దేవస్థానం ఈవో J వెంకట్రావు వారికి స్వాగతం పలికి స్వామివారి దర్శనానంతరo తీర్థప్రసాదాలు తో పాటు స్వామి వారి చిత్రపటాన్ని అందజేయడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కే సురేంద్రమోహన్,రాష్ట్ర కోశాధికారి ఎం నాగేంద్ర, అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జ్ కేశవ కాంత్, మీడియా ప్యానలిస్ట్ కే నర్సింగరావు, జిల్లా మీడియా కన్వీనర్ టి కోటేశ్వరరావు మరియు దేవస్థానం బోర్డు మెంబర్  ఎం సన్యాసిరావు  లతోపాటు రాష్ట్ర మరియు జిల్లా పదాధికారులు పాల్గొనడం జరిగింది

Comments