మూడు జిల్లాలను కలుపుతూ నిర్మించ తలపెట్టిన 120 అడుగుల సెమీ రింగ్ రోడ్డు అలైన్మెంట్ పనుల పురోగతిని సమీక్షించిన వి ఎం ఆర్ డి ఎ మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ ఎన్ తేజ్ భరత్ I.A.S., • తుది ప్లాన్ ఈ నెలాఖరుకు అందుబాటులోకి తీసుకొనిరావాలని ఆదేశించిన మెట్రోపాలిటన్ కమిషనర్.
K.V.SHARMA EDITOR
మూడు జిల్లాలను కలుపుతూ నిర్మించ తలపెట్టిన 120 అడుగుల సెమీ రింగ్ రోడ్డు అలైన్మెంట్ పనుల పురోగతిని సమీక్షించిన వి ఎం ఆర్ డి ఎ మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ ఎన్ తేజ్ భరత్ I.A.S.,
• తుది ప్లాన్ ఈ నెలాఖరుకు అందుబాటులోకి తీసుకొనిరావాలని ఆదేశించిన మెట్రోపాలిటన్ కమిషనర్.
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశకత్వంలో గౌ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాలమేరకు
భవిష్యత్తు రద్దీ నియంత్రణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విశాఖపట్టణం, విజయనగరం మరియు అనకాపల్లి జిల్లాలను కలుపుతూ 120 అడుగుల విస్తీర్ణం తో రాంబిల్లి నుంచి భోగాపురం వరకూ ప్రతిపాదించిన సెమీ రింగ్ రోడ్డు నిర్మాణానికి తుది అలైన్మెంట్ ప్లాన్ ను జూన్ నెలాఖరు నాటికి సిద్ధం చెయ్యాలని సంబంధిత కన్సల్టెంట్ ను ఆదేశించారు. అదేవిధంగా ఈ ప్రాంతాల్లో మైనర్ మరియు మేజర్ వంతెనల నిర్మాణ అవసరాలను గుర్తించి వాటిని నివేదిక లో పొందుపరచాలని సూచించారు. అభివృద్ధి చేయాల్సిన భూముల వివరాలు పూర్తి స్థాయిలో ప్లాన్లో పొందుపరచాలని ఆదేశించారు. కార్యక్రమంలో OSD శ్రీ కృష్ణ నాయక్, ప్రధాన ఇంజనీర్ శ్రీ వినయ్ కుమార్, పర్యవేక్ష ఇంజనీర్ మధుసూదన రావు , కార్యనిర్వహక ఇంజనీర్ దుర్గా ప్రసాద్ ప్లానింగ్ అధికారులు శ్రీమతి మౌనిక, శ్రీమతి రోహిణి, శ్రీ కిషోర్, ఎస్టేట్ విభాగ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment