జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 12.06.2026
. K.V.SHARMA EDITOR
విశాఖపట్నం :ఈరోజు అనగా తేదీ 12.06.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారు నరసింహనగర్-01, దొండపర్తి పట్టణ ఆరోగ్యకేంద్రములను సందర్శించి అక్కడ జరుగుతున్న హెచ్.పి.వి.వాక్సిన్ కార్యక్రమమును పరిశీలించి తగు సూచనలు చేశారు. తదుపరి ఇ.హెచ్.ఆర్., అభ ఐడి
రిజిస్ట్రేషన్, ఐ.వి.ఆర్.ఎస్. ద్వారా హాస్పిటల్ సేవలు అందుతున్నవి లేనివి తెలుసుకొనుట (పబ్లిక్ పెర్సప్షన్), కె.పి.ఐ. ఇండికేటర్స్, ఆర్.బి.ఎస్.కె సేవలు, ఓపి, ఐపి సేవలు, ల్యాబ్ టెస్ట్ లు, మందులు లభ్యత, ఎఫ్.ఆర్.ఎస్. హాజరు మొదలగు విషయాల గురించి సమీక్ష నిర్వహించారు. ఒ.ఆర్.ఎస్. పాకెట్స్ అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.
వైద్యాధికారులు అందుబాటులో లేకపోవడంతో అసహనం వ్యక్తం చేసారు. పారామెడికల్ సిబ్బంది అందరూ ఆరోగ్య కేంద్రములో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పట్టణ ఆరోగ్య కేంద్ర పరిసర ప్రాంతములు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్శనలో పట్టణ ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం




Comments
Post a Comment