Skip to main content

జాబ్ క్యాలెండర్‌తో దగా చేసిన జగన్ రెడ్డి... మెగా డీఎస్సీపై కొత్త డ్రామాలకు తెర* *▪️ పారదర్శకత, వేగానికి ప్రతీకగా మెగా డీఎస్సీ... 148 రోజుల్లో 16,347 ఉద్యోగాలతో లోకేష్ సరికొత్త రికార్డు* *▪️ ఉద్యోగాలే లక్ష్యంగా పాలన... యువత భవిష్యత్తుకు భరోసాగా నిలిచిన చంద్రబాబు-లోకేష్* *-- టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు*

.                   K.V.SHARMA EDITOR 
 విశాఖపట్నం, జూన్ 11:* రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావడం కూడా ఓర్వలేక గొడ్డలి పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి మెగా డీఎస్సీపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ మరో రాజకీయ డ్రామాకు తెరలేపారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా సక్రమంగా ఇవ్వలేని వ్యక్తి, కేవలం 148 రోజుల్లో దేశంలోనే రికార్డు స్థాయిలో 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వంపై బురదజల్లడం దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమన్నారు.

పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఎన్నికల ముందు 2.30 లక్షల ఉద్యోగాలు, 23 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, ఐదేళ్లపాటు జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. చివరకు ఎన్నికలకు రెండు నెలల ముందు 6,100 పోస్టులతో కంటితుడుపు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకున్నారని గుర్తుచేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకూడదనే దురుద్దేశంతో నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి వివిధ రూపాల్లో ఏకంగా 240 కేసులు వేయించారని పల్లా ఆరోపించారు. అయితే అన్ని స్థాయిల న్యాయస్థానాలు ప్రభుత్వ విధానాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గొడ్డలి పార్టీకి కోర్టుల్లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. ఆరోపణల్లో నిజం ఉంటే కోర్టులో ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు.

*148 రోజుల్లో దేశానికి ఆదర్శంగా మెగా డీఎస్సీ*

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైల్‌పైనే చేశారని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీనిని ఒక సవాల్‌గా తీసుకుని కేవలం 148 రోజుల్లోనే నియామక ప్రక్రియను పూర్తి చేశారని తెలిపారు. కోర్టు కేసులు, లీకేజీలు, రాజకీయ జోక్యాలకు తావులేకుండా దేశంలోనే అత్యంత పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించడం చారిత్రాత్మకమన్నారు.

ప్రస్తుతం విధుల్లో ఉన్న 16,347 మంది ఉపాధ్యాయుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే జగన్ లక్ష్యమని పల్లా విమర్శించారు. ఏడాది క్రితమే ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు నేడు పాఠశాలల్లో సేవలందిస్తుంటే, వారి కుటుంబాల్లో అనుమానాలు రేకెత్తించేలా మాట్లాడటం దుర్మార్గమన్నారు. వేలాది మంది పేద, మధ్యతరగతి కుటుంబాల కలలను అవమానించే ప్రయత్నమని మండిపడ్డారు.

మెగా డీఎస్సీ పరీక్షలను TCS ION ప్లాట్‌ఫారమ్ ద్వారా 256-బిట్ ఎన్‌క్రిప్షన్ భద్రతతో నిర్వహించామని పల్లా తెలిపారు. ఐఐటీ, జేఈఈ వంటి జాతీయ స్థాయి పరీక్షలు నిర్వహించే వేదికపై లీకేజీలు జరిగాయని మాట్లాడటం అజ్ఞానానికి పరాకాష్ట అన్నారు. 42 వేల ప్రశ్నలను ఎస్సీఈఆర్టీ నిపుణులు ప్రత్యేక భద్రతా గదిలో రూపొందించారని, ప్రతి సెషన్‌లో ర్యాండమైజేషన్ విధానం అమలు చేయడం వల్ల లీకేజీకి అవకాశం లేదన్నారు. కాల్ లెటర్ పంపితే ఉద్యోగం వచ్చేసినట్టే అన్నట్లుగా మాట్లాడటం గొడ్డలి పార్టీ నేతల అవగాహన రాహిత్యాన్ని సూచిస్తోందన్నారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నియామక ప్రక్రియలో సాధారణ దశ మాత్రమేనని, అర్హతలు, సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాతే తుది ఎంపిక జరుగుతుందని తెలిపారు.

*రిజర్వేషన్ల అమలులో చారిత్రాత్మక పారదర్శకత*

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గీకరణతో పాటు మహిళలు, దివ్యాంగులు, క్రీడాకారులు, మాజీ సైనికులకు సంబంధించిన హారిజాంటల్ రిజర్వేషన్లను పూర్తిస్థాయిలో అమలు చేశామని తెలిపారు. అభ్యర్థుల ర్యాంకులతో పాటు రోస్టర్, కమ్యూనిటీ, రిజర్వేషన్ల ఆధారంగానే ఎంపికలు జరిగాయని, కొన్ని ఉదాహరణలను వక్రీకరించి మొత్తం ప్రక్రియను తప్పుబట్టడం దురుద్దేశపూరితమన్నారు. స్పోర్ట్స్ కోటా కింద 3 శాతం రిజర్వేషన్‌ను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని, 431 పోస్టులు కేటాయించి వేలాది క్రీడాకారులకు అవకాశం కల్పించిందన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి కమిటీల ద్వారా కఠిన పరిశీలన తర్వాతే ఎంపికలు జరిగాయని, నకిలీ సర్టిఫికెట్లకు తావులేకుండా నిబంధనలను మరింత కఠినతరం చేశామని తెలిపారు.

*నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న చరిత్ర జగన్ కుటుంబానిది*

2006 డీఎస్సీ కడప స్కాం, గ్రూప్-1 మూల్యాంకన వివాదం, ఫేక్ కారుణ్య నియామకాలు, ఉపాధ్యాయ బదిలీల్లో అవినీతి వంటి ఘటనలను ప్రజలు మర్చిపోలేదని పల్లా పేర్కొన్నారు. 2006 డీఎస్సీలో ఓఎంఆర్ షీట్లను మార్చి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. గ్రూప్-1 పరీక్షల్లో అర్హత లేని వ్యక్తులతో పేపర్లు దిద్దించి వందలాది మంది అభ్యర్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందీ జగన్ ప్రభుత్వమేనన్నారు.

జీవో-117 ద్వారా దాదాపు 12 లక్షల మంది పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనని పల్లా విమర్శించారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి, యువతను ఆధారపడేలా చేయడమే వారి లక్ష్యమని అన్నారు.

ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని వారు, వేలాది ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి అభివృద్ధి, విద్యా వ్యవస్థకు బలోపేతం అనే లక్ష్యాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అబద్ధాలు, అపవాదులు, కుట్రల రాజకీయాలకు ప్రజలు ఇప్పటికే సమాధానం చెప్పారని, భవిష్యత్తులో మరింత గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Comments