జివిఎంసీ అన్ని జోన్లలో జూన్ 18 నుండి 24 వరకు "రెవెన్యూ (ట్యాక్స్) మేళాలు" *ఆస్తి పన్ను సంబంధిత సమస్యలకు ఒకేచోట పరిష్కారం. *పార్లమెంటు సభ్యులు / శాసనసభ్యులు / ప్రజా ప్రతినిధుల సమక్షంలో రెవెన్యూ మేళాల నిర్వహణ. *ప్రతి మేళాలో ఉదయం 11.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు అందుబాటులో సేవలు . *ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.
విశాఖపట్నం, జూన్ 16: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో ఆస్తి పన్ను సంబంధిత సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు అన్ని జోన్లలో ప్రత్యేకంగా "రెవెన్యూ (ట్యాక్స్) మేళాలు" పార్లమెంటు సభ్యులు / శాసనసభ్యులు / ప్రజా ప్రతినిధుల సమక్షంలో జూన్ 18 నుండి 24వ తేదీ వరకు జోన్ల వారీగా నిర్వహించనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇటీవల ఏప్రిల్ 25 నుండి 30వ తేదీ వరకు నిర్వహించిన రెవెన్యూ మేళాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో పాటు అనేక సమస్యలు నిర్ణీత కాలంలో పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రజలు కొరకు ఈ అవకాశాన్ని కల్పిస్తూ 2026 జూన్ 18 నుండి జూన్ 24 వరకు ఉదయం 11.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జోన్ల వారీగా రెవెన్యూ (ట్యాక్స్) మేళాలు నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు.
రెవెన్యూ (ట్యాక్స్) మేళాలు నిర్వహించు తేదీలు, వివరాలు
18.06.2026 (గురువారం): మధురవాడ జోన్, నార్త్ జోన్ 19.06.2026 (శుక్రవారం):భీమిలి జోన్,అగనంపూడి జోన్ 20.06.2026 (శనివారం):ఈస్ట్ జోన్,అనకాపల్లి జోన్ 23.06.2026 (మంగళవారం):సౌత్ జోన్,వెస్ట్ జోన్ 24.06.2026 (బుధవారం):గాజువాక జోన్,పెందుర్తి జోన్
రెవెన్యూ (టాక్స్ )మేళాల్లో అందించబడు సేవలు:
*కొత్త ఆస్తి పన్ను అసెస్‌మెంట్ (New Assessment) *భవనాల తొలగింపు (Demolition)
*చేర్పులు, మార్పులు (Addition / Alteration) *ఆస్తి విభజన (Bifurcation)
*రివిజన్ పిటిషన్లు
*జనరల్ రివిజన్ పిటిషన్లు
*పన్ను మినహాయింపులు (Tax Exemptions) *టైటిల్ ట్రాన్స్ఫర్ (Title Transfer)
*ఆస్తుల విలీనం (Amalgamation)
*యజమాని పేరు సవరణ
*డోర్ నంబర్ సవరణ తదితర సేవలు ఈ మేళాలో అందించబడతాయని కమిషనర్ తెలిపారు.
ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు, అవసరమైన పత్రాలతో సంబంధిత జోన్లలో నిర్వహించే మేళాలకు హాజరై సేవలను పొందవచ్చని తెలిపారు. అందిన దరఖాస్తులను అదే రోజు నమోదు చేసి, నిర్ణీత సేవా ప్రమాణాల (SLA) ప్రకారం త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అలాగే ప్రజాప్రతినిధులు పాల్గొను ఈ మేళాలకు సంబంధించి .., వార్డు సచివాలయాలు, నివాసిత సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ మేళాలపై విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు.

Comments
Post a Comment