భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఘనంగా "సంవిధాన్ హత్య దివస్" భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో, 1975 జూన్ 25వ తేదీన దేశంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా విధించిన ఎమర్జెన్సీని నిరసిస్తూ... భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ ఎం.ఎం.ఎన్. పరశురామరాజు గారి అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో "సంవిధాన్ हत्या दिवस" (రాజ్యాంగ హత్య దినం) కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
విశాఖపట్నం, 26 జూన్ 2026ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారు హాజరయ్యారుఈ సందర్భంగా ముఖ్యఅతిథి మాట్లాడుతూ:ఇందిరాగాంధీ భారత ప్రధానిగా ఉన్న సమయంలో అలహాబాద్ హైకోర్టు ఆమెకు వ్యతిరేకంగా తీర్పునిచ్చిందని, ఆ క్రమంలో ఆమె ప్రధాని పదవి నుండి తప్పుకోవాల్సి రాగా... స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలో అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) విధించారని గుర్తుచేశారు. ఆ నల్లటి రోజుల్లో విపక్ష రాజకీయ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయించారని, పత్రికా స్వేచ్ఛను హరిస్తూ మీడియా ప్రతినిధులను నిర్బంధించడమే కాకుండా పత్రికా కార్యాలయాలకు విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గళమెత్తిన వారిని అక్రమంగా జైళ్లలో బంధించి వేధించారని ఆయన తెలియజేశారు.
భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఎన్నో పోరాటాలు చేసిందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కుతంత్రాలతో కూల్చివేసినప్పుడు, వారికి మొదటిగా అండగా నిలిచి, సంఘీభావం ప్రకటించింది నాటి బిజెపి (జనసంఘ్ నేతలు) అని ఆయన గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కే. సురేంద్రమోహన్, రాష్ట్ర కోశాధికారి ఎం. నాగేంద్ర, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ కేశవ్ కాంత్, సంవిధాన్ హత్య దివస్ రాష్ట్ర కన్వీనర్ కే.ఎన్.పి. చక్రవర్తి, జిల్లా కన్వీనర్ పొలిమేర శ్రీనివాస్ లతో పాటు రాష్ట్ర, జిల్లా పదాధికారులు, వివిధ విభాగాల నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments
Post a Comment