సమాచార పౌర సంబంధాల శాఖ జోన్ - 1 రీజనల్ జాయింట్ డైరెక్టర్ గా శ్రీ కె.సదారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు
K.V.SHARMA EDITOR
విశాఖపట్నం :విశాఖ సందేశం వార్తలు :విశాఖపట్నం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిగా పనిచేస్తున్న సదారావుకు ప్రభుత్వం జాయింట్ డైరెక్టర్ గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రీజినల్ జాయింట్ డైరెక్టర్ తో పాటు విశాఖ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించాలని ఆ శాఖ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ ఆదేశాలు జారీ చేశారు.
శ్రీ కె .సదారావు 1991లో ఏపీఆర్ఓగా పాడేరులో జాయిన్ అయ్యారు.అనంతరం డివిజనల్ పిఆర్ఓ గా పలుచోట్ల, VMC లో PRO గా ,కృష్ణా ,పశ్చిమగోదావరి, జిల్లాల్లో డి పి ఆర్ ఓ గా, విజయవాడ నగరంలో ఏడిగా, నెల్లూరులో ఉపసంచాలకులుగా సమాచార పౌర సంబంధాల శాఖ రాష్ట్ర కార్యాలయంలో ఎ డి గా, డి డి గా పని చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడానికి తన వంతు కృషి చేస్తానని శ్రీ సదారావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ అన్నమ్మ, కార్యాలయ సిబ్బంది ఇందిర,మోహన రావు, అలీం తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment