యంగ్ క్రికెటర్స్ కు అపార అవకాశాలు* *ప్రతిభను ప్రోత్సహించేందుకు* *20-20 టోర్నీ* *9 జట్లు ..పది రోజులు* *మూడు మైదానాల్లో నిర్వహణ* *రైల్వే మైదానంలో ప్రారంభమైన* *ఎస్ ఏ సి టి క్రికెట్ పోటీలు*
స్టేడియం. విశాఖపట్నం జూన్ 5ఉత్తరాంధ్రలో ఎంతో ప్రతిబా వంతులైన క్రికెట్ ఆటగాళ్లు ఉన్నారని.. వారిని ప్రోత్సహించేందుకే శ్రీ ఆరాధన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు చాట్లసూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు..
శుక్రవారం ఇక్కడ రైల్వే మైదానం వేదికగా ఎస్ ఎ సి టి 20 20 క్రికెట్ టోర్నీ అంగ రంగ వైభవంగా ప్రారంభమైంది.. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పది రోజులు పాటు మూడు మైదానాల్లో 9 జట్లు హోరా హరీగా
తల పడనున్నట్లు చెప్పారు.. జట్ల ఆటగాళ్లను 9 ప్రాంచేజ్ లగా ఎంపిక చేయడం జరిగింది అన్నారు.. ముఖ్య అతిథిగా హాజరైన కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు లు మాట్లాడుతూ
యువ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి టోర్నీలు దోహదం చేస్తాయన్నారు.. ఇక్కడ బాగా ఆడిన వారికి ఏ పీ ఎల్.. ఐపీఎల్ మ్యాచ్ ల్లో కూడా ఎంపిక అయ్యేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ఎంతో కష్టపడి 20 20 క్రికెట్ టోర్నీ నిర్వహించడం అభినందనీయం అన్నారు.. ప్రతిభ గల క్రీడాకారులను దేశానికి అందించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు.. తొలుత
వైజాగ్ రైజింగ్ స్టార్స్.. ధర్మ వారియర్స్ జట్లు తలపడగా ఇరుజట్ల క్రీడాకారులను అతిధులు పరిచయం చేసుకున్నారు.. అనంతరం 20.. 20 టోర్నమెంట్ను అట్టహాసంగా ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో రామకృష్ణ ప్రసాద్
ఫెడరేషన్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాసరావు.. మదన్ తదితర క్రీడాకారులంతా పాల్గొన్నారు




Comments
Post a Comment