Skip to main content

వీఎంఆర్‌డీఏ సవరించిన ముసాయిదా మాస్టర్ ప్లాన్–2041 ప్రభుత్వానికి సమర్పణ

.                       K.V.SHARMA EDITOR 
విశాఖ: విశాఖ సందేశం :12జూన్
 రాష్ట్రప్రభుత్వంసూచనల మేరకు VMRDA గతంలో రూపొందించిన బృహత్ ప్రణాళిక –2041(Master Plan) రూపకల్పనలో  జరిగిన తప్పిదాలను సరిద్దేవిధంగా  బృహత్ ప్రణాళికను (Master Plan) పునః పరిశీలనకు   అనుమతించిన దరిమిలా ప్రజల నుంచి అందిన 1,241 అభ్యంతరాలు మరియు సూచనలను విశ్లేషించి, వాటిలోని 339 ప్రత్యేక అభ్యంతరాలు/సూచనలన్నింటినీ సవివరంగా పరిశీలించి, తగు మేరకు మాస్టర్ ప్లాన్‌లో ప్రతిబింబింపజేస్తూ సవరించిన ముసాయిదా మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖలు, నిపుణులు మరియు సంబంధిత వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర సమీక్ష  సమావేశాలను నిర్వహించి అన్ని అంశాలను క్రోడీకరించిన తదుపరి అవసరమైన సవరణలు, మార్పులు చేర్పులు చేసి తుది ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలన కోసం ఈ రోజు మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ S సురేష్ కుమార్, ఐ ఏ ఎస్ వారికి VMRDA మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ N తేజ్ భరత్ ఐ ఏ ఎస్., వెలగపూడి సచివాలయంలో సమర్పించడం జరిగిందన్నారు. 


ప్రస్తుత ప్రణాళిక ప్రకారం 2041 నాటికి సుమారు 66.30 లక్షల జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకొని నివాస, వాణిజ్య, మిశ్రమ వినియోగ, పారిశ్రామిక, రవాణా, వినోద మరియు ప్రజా సదుపాయాలకు అవసరమైన భూవినియోగాన్ని శాస్త్రీయంగా ప్రతిపాదించామని, అదేవిధంగా సుమారు 3,913 కి.మీ.ల రహదారి నెట్‌వర్క్, మెట్రో రైలు కారిడార్లు, సబర్బన్ రైలు వ్యవస్థ, భోగాపురం విమానాశ్రయానికి అనుసంధాన రహదారులు మరియు తీర ప్రాంత అభివృద్ధి కారిడార్‌కు ప్రాధాన్యత ఇవ్వబడిందన్నారు. అదేవిధంగా పరిశ్రమలు, పర్యాటకం, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు, APIIC, జాతీయ రహదారుల సంస్థ మరియు ఇతర కీలక శాఖలతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపి, వారి సూచనలను కూడా మాస్టర్ ప్లాన్‌లో పొందుపరచడం జరిగిందన్నారు. ప్రస్తుత ప్రణాళికలో ప్రాంతీయ అభివృద్ధి అవసరాలు, భవిష్యత్ జనాభా వృద్ధి, పారిశ్రామిక మరియు ఆర్థిక కార్యకలాపాల విస్తరణ, రవాణా అనుసంధాన వ్యవస్థ, పర్యావరణ పరిరక్షణ, అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, విశాఖ–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, పోర్ట్ ఆధారిత అభివృద్ధి, జాతీయ రహదారుల విస్తరణ, పారిశ్రామిక కారిడార్లు మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన  విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (VER) కింద ప్రతిపాదిత ప్రాజెక్టులు మరియు భవిష్యత్ వృద్ధి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికను రూపొందించమని ఆయన అన్నారు.


ఈ సవరించిన ముసాయిదా మాస్టర్ ప్లాన్–2041 అమలులోకి వచ్చిన తరువాత విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల పరిధిలోని విశాఖపట్నం మహానగర ప్రాంతంలో సమతుల్య భూవినియోగం, సమర్థవంతమైన రవాణా వ్యవస్థ, పారిశ్రామిక మరియు ఆర్థికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మరియు మెరుగైన జీవన ప్రమాణాల సాధనకు మార్గదర్శకంగా నిలవనుందని, 


ప్రభుత్వ ఆమోదం అనంతరం మాస్టర్ ప్లాన్‌ను అధికారికంగా ప్రకటించి అమలు చర్యలు చేపట్టనున్నట్లు  తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన ప్రధాన ప్రణాలీకాధికారిణి శ్రీమతి దివ్యలత, ప్లానింగ్ అధికారులు కిషోర్ మౌనిక మహాపాత్ర, అరుణవల్లి లీ అసోసియేట్స్ ప్రతినిధులు శ్రీ పన్నీర్ సెల్వం తదితరులు పాల్గొన్నారు

Comments