సత్య సాయి విద్యా విహార్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ-అందరినీ అబ్బుర పరచిన విద్యార్థుల యోగాసనాలు* విశాఖపట్నం, జూన్ 21: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని *శ్రీ సత్య సాయి విద్యా విహార్, విశాఖపట్నంలో ఈరోజు యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు*. ఉదయం 7 గంటల నుండి 7:45 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో 8వ, 9వ, 10వ తరగతుల విద్యార్థులు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి *ప్రముఖ యోగా నిపుణురాలు, హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ ట్రైనర్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పీజీ డిప్లొమా ఇన్ యోగా పట్టా పొందిన శ్రీమతి డి.వి.ఎస్. పద్మలీల* గారు విశిష్ట అతిథిగా విచ్చేశారు. పాఠశాల మేనేజ్‌మెంట్ సభ్యులు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ శ్రీమతి చేకూరి వరలక్ష్మి గారు, అధ్యాపక, అధ్యాపకేతార సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నాడీ శోధన ప్రాణాయామం, శాంభవి ముద్ర, సూర్య నమస్కారాలు, అలాగే వివిధ కూర్చుని మరియు నిల్చుని చేసే యోగా ఆసనాలను చక్కగా ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.
. కె. వి. శర్మ, ఎడిటర్,
విశాఖపట్నం:విశాఖ సందేశం వార్తలు : జూన్ 21:12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని *శ్రీ సత్య సాయి విద్యా విహార్, విశాఖపట్నంలో ఈరోజు యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు*.
ఉదయం 7 గంటల నుండి 7:45 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో 8వ, 9వ, 10వ తరగతుల విద్యార్థులు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు.
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి *ప్రముఖ యోగా నిపుణురాలు, హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ ట్రైనర్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పీజీ డిప్లొమా ఇన్ యోగా పట్టా పొందిన శ్రీమతి డి.వి.ఎస్. పద్మలీల* గారు విశిష్ట అతిథిగా విచ్చేశారు. పాఠశాల మేనేజ్‌మెంట్ సభ్యులు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు నాడీ శోధన ప్రాణాయామం, శాంభవి ముద్ర, సూర్య నమస్కారాలు, అలాగే వివిధ కూర్చుని మరియు నిల్చుని చేసే యోగా ఆసనాలను చక్కగా ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన శ్రీమతి డి.వి.ఎస్. పద్మలీల గారు, *శ్రీ సత్య సాయి విద్యా విహార్ విద్యార్థులు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా బోధించిన మానవతా విలువల ఆధారిత విద్యను అభ్యసించడం ఎంతో అదృష్టకరమని* పేర్కొన్నారు. విద్యతో పాటు సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస వంటి మానవ విలువలను అలవర్చుకోవడం ద్వారా విద్యార్థులు ఆదర్శ పౌరులుగా ఎదగగలరని ఆమె తెలిపారు.
యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా, శరీరం, మనస్సు మరియు ఆత్మ మధ్య సమతుల్యతను కల్పించే జీవన విధానమని పేర్కొన్నారు. యోగాను నిరంతర సాధనగా కొనసాగిస్తే జీవితంలోని అనేక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనవచ్చని తెలిపారు.
యోగా సాధన ద్వారా విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెరగడం, పరీక్షల ఒత్తిడి తగ్గడం, ఆత్మవిశ్వాసం పెంపొందడం, ఏకాగ్రత మరియు క్రమశిక్షణ అలవడడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు.

ప్రిన్సిపాల్ శ్రీమతి చేకూరి వరలక్ష్మి గారు, అధ్యాపక, అధ్యాపకేతార సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు నాడీ శోధన ప్రాణాయామం, శాంభవి ముద్ర, సూర్య నమస్కారాలు, అలాగే వివిధ కూర్చుని మరియు నిల్చుని చేసే యోగా ఆసనాలను చక్కగా ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన శ్రీమతి డి.వి.ఎస్. పద్మలీల గారు, *శ్రీ సత్య సాయి విద్యా విహార్ విద్యార్థులు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా బోధించిన మానవతా విలువల ఆధారిత విద్యను అభ్యసించడం ఎంతో అదృష్టకరమని* పేర్కొన్నారు. విద్యతో పాటు సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస వంటి మానవ విలువలను అలవర్చుకోవడం ద్వారా విద్యార్థులు ఆదర్శ పౌరులుగా ఎదగగలరని ఆమె తెలిపారు.
యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా, శరీరం, మనస్సు మరియు ఆత్మ మధ్య సమతుల్యతను కల్పించే జీవన విధానమని పేర్కొన్నారు. యోగాను నిరంతర సాధనగా కొనసాగిస్తే జీవితంలోని అనేక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనవచ్చని తెలిపారు.
*పాఠశాలలో పాఠ్యేతర కార్యక్రమాలలో భాగంగా విద్యార్థులకు యోగా శిక్షణను క్రమం తప్పకుండా అందిస్తున్నందుకు స్కూలు యాజమాన్యాన్ని శ్రీమతి పద్మ లీల ప్రత్యేకంగా అభినందించారు .
యోగా సాధన ద్వారా విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెరగడం, పరీక్షల ఒత్తిడి తగ్గడం, ఆత్మవిశ్వాసం పెంపొందడం, ఏకాగ్రత మరియు క్రమశిక్షణ అలవడడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు.
కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

Comments
Post a Comment