Skip to main content

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి* *21న ఆర్కేబీచ్ వేదిక‌గా నిర్వ‌హించే కార్య‌క్ర‌మానికి ప‌టిష్ట ఏర్పాట్లు చేయాలి* *సంబంధిత శాఖల‌న్నీ సమన్వయంతో పనిచేయాలి కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్*

 

                   K.V.SHARMA EDITOR 

    విశాఖపట్నం 12వ అంతర్జాతీయ యోగా     దినోత్సవం-2026 సంద ర్భంగా జిల్లాలో నిర్వహించ‌ త‌ల‌పెట్టిన‌ యోగాంధ్ర వేడుక‌ల‌ను విజయ వంతంగా జ‌రిపించేందుకు అన్ని శాఖలు సమన్వయం తో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో పలు థీమాటిక్ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంటూ ఇప్పటికే జూన్ 11న నావల్ డాక్‌యార్డ్‌లో మాజీ సైనికులు, రక్షణ సిబ్బంది కోసం యోగా కార్యక్రమం, జూన్ 12న రుషికొండ బీచ్‌లో పర్యాటక యోగా, జూన్ 16న ముడసర్లోవ ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్‌లో మరో యోగా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు.


అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రధాన కార్యక్రమాన్ని జూన్ 21న ఆర్‌కే బీచ్‌లో కాళీమాత ఆల‌యం నుంచి విక్ట‌రీ ఎట్ సీ వ‌ర‌కు ఉద‌యం 6.00 నుంచి 7.00 గంట‌ల మ‌ధ్య‌లో భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనిలో పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొనేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి నోడల్ అధికారులు, వేదిక ఇన్‌చార్జ్‌లు వారి బాధ్య‌త‌ల‌ను ప‌క్కాగా నిర్వ‌ర్తించాల‌ని చెప్పారు. సమీకరణ, ప్రచారం, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రత, వైద్య సేవలు, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత శాఖలకు సూచించారు. యోగాను ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో జిల్లావాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


జాయింట్ క‌లెక్ట‌ర్ గొబ్బిళ్ల విద్యాధ‌రి, డీసీపీలు మేరీ ప్ర‌శాంతి, మ‌ణికంఠ‌, ఇన్ఛార్జి డీఆర్వో టి. గోవిందు, ఆర్డీవో దిలీప్ చక్ర‌వ‌ర్తి ఇత‌ర శాఖ‌ల జిల్లా స్థాయి అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు

Comments