శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం సింహాచలం దేవస్థాన హుండీల ఆదాయం రూ.2.21 కోట్లు
K.V.SHARMA EDITOR
సింహాచలం, జూన్ 02, 2026 :సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో మంగళవారం నిర్వహించిన హుండీల లెక్కింపులో మొత్తం రూ.2,21,12,845 ఆదాయం లభించినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు తెలిపారు.
గత నెల 13వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు 20 రోజుల కాలానికి సంబంధించిన హుండీలను ఆలయ ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ లెక్కించారు. హుండీల ద్వారా 54 గ్రాములు 800 మిల్లీగ్రాముల బంగారం, 9 కిలోలు 150 గ్రాముల వెండి సమర్పితమయ్యాయి.
నగదు రూపంలో రూ.2,07,57,560 నోట్లు, రూ.13,55,285 నాణేలు లభించగా, మొత్తం ఆదాయం రూ.2,21,12,845గా నమోదైంది. సగటున రోజుకు రూ.11.05 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా ఎండోమెంట్స్ శాఖ అధికారులు బండారు ప్రసాద్, శ్రీధర్, టెంపుల్ సెక్యూరిటీ ఎస్‌పీఎఫ్ పోలీసు బలగాల సమక్షంలో, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు.
కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు కరకదేముడు, మహేష్, సన్యాసిరావు పాల్గొన్నారు. అలాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధ, సహాయ కార్యనిర్వహణాధికారులు వాడ్రేవు రమణమూర్తి, పంతం శ్రీనివాస్, పర్యవేక్షణ అధికారులు, ఇంజినీరింగ్ విభాగ అధికారులు, సిబ్బంది, శ్రీహరి సేవా వాలంటీర్లు హుండీల లెక్కింపులో పాల్గొన్నారు.
హుండీలలో అమెరికా, యూఏఈ, ఒమాన్, సింగపూర్, కెనడా, కువైట్ తదితర దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా భక్తులు సమర్పించినట్లు అధికారులు తెలిపారు.



Comments
Post a Comment