Skip to main content

దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు డా. శ్యామాప్రసాద్ ముఖర్జీ: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షులు పరశురామరాజు* ​విశాఖపట్నం: దేశ సమగ్రత కోసం, ఒకే పరిపాలనా విధానం కోసం పోరాడిన మహనీయుడు, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డా. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి 'బలిదాన్ దివస్' (వర్ధంతి) కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షుల క్యాంపు కార్యాలయంలోని 223వ పోలింగ్ బూత్ పరిధిలో ఘనంగా నిర్వహించబడింది.

                  K.V.SHARMA EDITOR 


విశాఖపట్నం: దేశ సమగ్రత కోసం, ఒకే పరిపాలనా విధానం కోసం పోరాడిన మహనీయుడు, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డా. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి 'బలిదాన్ దివస్' (వర్ధంతి) కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షుల క్యాంపు కార్యాలయంలోని 223వ పోలింగ్ బూత్ పరిధిలో ఘనంగా నిర్వహించబడింది. 

ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ముఖర్జీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.


జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారు మాట్లాడుతూ... "ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు ఉండకూడదు" అనే బలమైన నినాదంతో జమ్మూ కాశ్మీర్ సంపూర్ణ విలీనం కోసం ముఖర్జీ గారు సాగించిన పోరాటం చారిత్రాత్మకమైనదన్నారు. 


దేశ జాతీయ సమైక్యతను కాపాడటం కోసం ఆయన అర్పించిన ప్రాణాలు, చేసిన త్యాగం నేటి తరానికి, ప్రతి ఒక్క కార్యకర్తకు ఎంతో ఆదర్శనీయమని కొనియాడారు. 

ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

​కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి  ఎస్ దానిష్, కార్యదర్శి L  శ్రీరామ్, జిల్లా మీడియా కన్వినర్ టి  కోటేశ్వరరావు, సోషల్ మీడియా కన్వినర్ జి రాకేష్ లతో పాటు జిల్లా పదాధికారులు నాయకులు పాల్గొన్నరు.

Comments