Skip to main content

ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యంలో గ్రీన్ క‌వ‌ర్‌ను పెంచాలి - ఏయూలో గ్రీన్ క‌వ‌ర్ 25 శాతం ఉంది - ఏయూపై ప్ర‌త్యేక ఫోక‌స్ - బ‌యో డైవ‌ర్సిటీ పార్క్ అభివృద్ధి చేయండి -నెట్ జీరో దిశ‌గా ప‌య‌నించాలి -ఏయూవీసీతో రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు

.                 K.V.SHARMA EDITOR 
ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, జూన్5:ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యంలో గ్రీన్ క‌వ‌ర్‌ను పెంచాల‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సూచించారు. విశాఖ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న శుక్ర‌వారం ఉద‌యం ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల వ‌ద్ద‌నున్న హెలీపాడ్‌కు వాయుమార్గంలో చేరుకున్నారు. అక్క‌డ ప్ర‌పంచ ప‌ర్య‌వర‌ణ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని మెక్క‌ను నాటారు. అనంత‌రం ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్‌తో ఆప్యాయంగా మాట్లాడారు. వందేళ్ల చ‌రిత్ర క‌లిగిన ఏయూలో గ్రీన్ క‌వ‌ర్ 25 శాతం ఉంద‌ని, దీనిని మ‌రింత పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. తాను ఏయూపై ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టాన‌ని, ఒక ప్ర‌ణాళిక వేసుకుని ముందుకు వెళ్లాల‌ని  కోరారు. వీసీతో ప్ర‌త్యేకంగా  దాదాపు ప‌ది నిమిషాలు మాట్లాడి, ఏయూలో మెక్క‌లు పెంచ‌డం, ప‌చ్చ‌ని ప‌రిస‌రాల‌ను అభివృద్ధి చేయ‌డంపై దృష్టిసారించాల‌న్నారు. ఏయూకు ఒక దిశానిర్ధేశం చేయాల‌ని, డైరెక్ష‌న్ ఇచ్చామ‌న్నారు. నెట్ జీరో కాన్సెప్ట్‌తో సాగాల‌న్నారు. చారిత్ర‌క ప్రాధ‌న్య‌త క‌లిగి, ఎంద‌రో నాయ‌కుల‌ను త‌యారు చేసిన ఏయూ ప‌చ్చ‌ద‌నం పెంచ‌డంలో సైతం ఆద‌ర్శంగా నిల‌వాల‌న్నారు. ఈ సంద‌ర్భంలో ఏయూలో హ‌రిత వ‌నాల పెంపుకు, సోలార్ విద్యుత్ ప్ర‌స్తుత ప‌రిస్థితులు, చేప‌డుతున్న చ‌ర్య‌లను వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ ముఖ్య‌మంత్రికి వివ‌రించారు.



అనంత‌రం మీడియాతో ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ వాతావ‌ర‌ణ మార్పులు, ఎండ‌లు పెర‌గ‌డం మ‌నం చూస్తున్నామ‌న్నారు. ఏయూలో 450 ఎక‌రాల భూమి ఉంద‌ని, భ‌వ‌నాలు కాకుండా, వ‌ర్సిటీకి అవ‌స‌ర‌మైన విద్యుత్‌ను సౌర విద్యుత్తో  ఉత్ప‌త్తి చేయాల‌న్నారు. తిరుమ‌ల క్యాంప‌స్‌లో 89.5లో గ్రీన‌రీ ఉంద‌న్నారు. దీని కార‌ణంగా అక్క‌డ వాతావ‌ర‌ణం ఎంతో మార్పు చూడ‌వ‌చ్చ‌న్నారు. ఏయూ ఒక బయోడైవ‌ర్సిటీ పార్క్‌గా నిల‌వాల‌ని, వివిధ దేశాల‌లో ఉన్న మెక్క‌ల‌ను ఇక్క‌డ‌కు తీసుకువ‌చ్చి పెంచాల‌ని సూచించారు. వీటిని చూస్తే యువ‌త‌కు సంతోషం, విజ్ఞానం పొందాల‌న్నారు.

ఏయూ హాస్ట‌ల్‌లు, కాలేజీల‌లో ఉత్ప‌త్తి అయ్యే వేస్ట్‌ను మూడు ర‌కాలుగా పున‌ర్వినియోగం చేయాల‌న్నారు. కాంపోస్ట్ త‌యారీ, బ‌యో గ్యాస్ త‌యారీ దిశ‌గా పని చేయాల‌ని, రీసైక్లింగ్ చేయ‌డం, నిరుప‌యోగ చెత్త‌కు వేస్ట్ ఎన‌ర్జీ ప్లాంట్‌కు పంప‌డం,  ప్ర‌తీ నీటి బొట్టును స‌ద్వినియోగం చేయ‌డం, వాట‌ర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాల‌ని సూచించామ‌న్నారు. పిఎన్‌జి గ్యాస్ వినియోగించి వంట‌లు చేయ‌డం, విద్యుత్ పొయ్యిల‌ను ఉప‌యోగించాల‌ని వీసీ గారిని కోరామ‌న్నారు. యువ‌త‌కు ఆస‌క్తి పెంచే విధంగా, మోడ‌ల్ యూనివ‌ర్సిటీగా ఏయూ నిల‌వాన్నారు. అనుబంధ క‌ళాశాల‌ల‌కు మార్గ‌ద‌ర్శ‌కం అందించే విధంగా ఏయూ కృషి చేయాల‌ని సూచించారు. నాలెడ్జ్‌, కాప్ విభాగాల‌లో టాప్ 10 స్థానాల‌లో ఏయూ చేరాల‌న్నారు.


నిపుణులైన ఆచార్యుల‌ను మార్గ‌ద‌ర్శ‌కం చేస్తూ ఇన్ హౌస్ నాలెడ్జ్‌ను అవుట్ సోర్సింగ్ విధానంలో చేయాల‌న్నారు. విశ్వ‌విద్యాల‌యం ఒక ఎక్స్‌పీరియ‌న్స్ కేంద్రంగా నిల‌వాల‌న్నారు. బ్లూప్రింట్ త‌యారు చేసి, విద్యార్థుల ఆలోచ‌న‌ల‌ను ఇంటిగ్రేట్ చేస్తూ, సిబ్బంది స‌హ‌కారంతో దీనికి అమ‌లు చేస్తార‌న్నారు. సైకిల్‌పై తిర‌గ‌డం జీవితంలో భాగం చేసుకోవాల‌న్నారు. శారీర‌క వ్యాయామం, 


విశాఖ‌లో సైక్లింగ్ పాథ్‌ల‌ను త‌యారు చేస్తామ‌న్నారు. సైక్లింగ్‌కి అనువైన‌టువంటి వాతావ‌ర‌ణం పెంచుతామ‌ని, గ్రీన‌రీని 50 శాతానికి పెంచుతామ‌న్నారు. 5 కోట్ల సీడ్ బాల్స్ త‌యారు చేస్తున్నామ‌న్నారు. 2047 నాటిని రాష్ట్రంలో గ్రీన‌రీ 50 శాతానికి వృద్ధి చేస్తామ‌న్నారు.

Comments