జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 27.06.2026
ఈరోజు అనగా తేదీ 27.06.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారు పత్రికాముఖంగా తెలియచేస్తూ ఈ నెల 28.06.2026 ఆదివారం నాడు 0-5 సంవత్సరముల చిన్నారులకు జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం అన్ని ప్రాధమిక/పట్టణ కేంద్రములు మరియు ట్రాన్సిట్ బూత్ లు (రైల్వే స్టేషన్, బస్సు కాంప్లెక్స్ వగైరా..) నందు నిర్వహించబడును. కనుక ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయుకోవాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు తెలియచేసారు. తేది. 28.06.2026 నాడు ఏ కారణం చేతనైనా పోలియో చుక్కలు వేయించుకోలేని యెడల 29 మరియు 30 వ తేదిలలో ఇంటింటికీ తిరిగి చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. ఇందుకు గాను మొత్తం 1062 బూత్ లు, 62 ట్రాన్సిట్ బూత్ లు, 94 మొబైల్ బూత్ లు ఏర్పాటు చేయబడ్డాయని తెలియచేసారు. విశాఖపట్నం జిల్లా లో గుర్తించిన 85 హైరిస్క్ ప్రాంతాలు, 6,497 హైరిస్క్ చిన్నారులు, 54 మురికివాడలు (35 సెట్ట్లేడ్, 19 మైగ్రేటేడ్) లోని 4,685 మంది చిన్నారులకు ప్రత్యెక ప్రణాళిక తో పోలియో చుక్కలు వేస్తారు. ఈ భారీ కార్యక్రమానికి 4,518 మంది వేక్షినేటర్స్, 120 మంది సూపర్వైజర్స్, 49 కోల్డ్ చైన్ యూనిట్స్ సిద్దంగా యున్నాయని తెలియచేసారు. ఇందుకు గాను సుమారు మొత్తం 2,09,660 ఒపివి డోసులు అవసరమవుతావి.
ఈ నెల 22 వ తేదిన జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ వారి అధ్యక్షతన నిర్వహించిన డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్సు కమిటీ సమావేశంలో విశాఖపట్నం జిల్లా మొత్తం జనాబా 19,54,4,9,4 లో 0-5 సంవత్సరముల లోపు చిన్నారులు 1,89,712 లక్ష్యంగా నిర్దేశించబడింది. జిల్లా కలెక్టర్ వారి ఆదేశానుసారం జివిఎంసి సి.ఎం.ఒ.హెచ్ వారు బూత్ ల పరిశుభ్రత, త్రాగునీటి సరఫరా, పాటశాల బూత్ లను ప్రారంబించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. నిర్దేశించిన మండల మీటింగ్స్ లో చెప్పినట్లుగా గ్రామా సచివాలయంలతో కలిసి పిల్లల మొబిలైజేషన్ చేపట్టాలి. సంబందిత వైద్యాధికారుల అభ్యర్దన మేరకు టీచర్లను బూత్ మరియు ఇంటింటి కార్యకలాపాలకు వినియోగించాలని తెలియచేసారు.
ఈ పోలియో చుక్కల కార్యక్రమానికి అన్ని డిపార్టుమెంటుల వారు సమన్వయం చేసి, ముఖ్యంగా ఐ.సి.డి.ఎస్.-సి.డి.పి.ఒ.లు, సూపర్వైజర్లు, అంగన్వాడి వర్కర్స్ మరియు డి.ఆర్.డి.ఎ. మహిళా సంఘాలు 28,29 మరియు 30 తేదీలలో సంపూర్ణంగా పాల్గొనాలి. ఈ పోలియో చుక్కల కార్యక్రమం జూన్ 30 వ తేది వరకు నిరంతరాయంగా ఎలక్ట్రిసిటీ సరఫరా చేయాలని తెలియచేసారు. ఈ పోలియో చుక్కలకు సెల్ఫ్ హెల్ఫ్ గ్రూప్ ల ద్వారా మద్దతు కలుగచేస్తూ ప్రైవేటు హాస్పిటల్స్ నందు, పంచాయతీ డిపార్టుమెంటు, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ వారి సహకారం తో బూత్ లు ఏర్పాటు చేయాలని తెలియచేసారు. రైల్వేస్, స్టీల్ ప్లాంట్, నేవీ, పోర్ట్, కమ్యూనిటీ మొబిలైజేషన్ బూత్ లు ఏర్పాటు చేసి 0-5 సంవత్సరముల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, పోలియో రహిత భారతదేశాన్ని ప్రపంచానికి చూపిద్దాం అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు వారు, డా.లూసి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం అధికారులందరినీ మానిటరింగ్ అధికారులుగా మరియు తమ తమ ప్రాంతాలలో గల స్థానిక నాయకులను సమన్వయం చేసుకుని పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు వారు కోరారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం

Comments
Post a Comment