28న ""ప్రతిభకు ప్రోత్సాహం"" **దేశ "విదేశీ కళాకారులకు కళాజీవా పురస్కారాలు ** 60 మందికి మీడియా అవార్డులు
వైజాగ్: స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్, వైజాగ్ మీడియా అవార్డుల కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన జాతీయ, అంతర్జాతీయ కళాకారులు, మీడియా సోదరులను ప్రోత్సహిస్తూ "ప్రతిభకు ప్రోత్సాహం 20 26 "పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిటీ చైర్మన్లు గంట్ల శ్రీనుబాబు, ఆర్. నాగరాజు పట్నాయక్ లు పేర్కొన్నారు. ఈ మేరకు వీ జె ఎఫ్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సిరిపురం వి. ఎం. ఆర్. డి. ఏ. చిల్డ్రన్స్ ఎరినాలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి శ్రీలంక, గుజరాత్,బెంగాల్, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన అంతర్జాతీయ కళాకారుల ప్రదర్శనలతో
ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. 60 మంది మీడియా ప్రతినిధులకు, 35 మంది కళాకారులకు,150 మంది జర్నలిస్టుల పిల్లలకు మెరిట్స్ స్కాలర్షిప్స్ అందించునున్న మన్నారు. విశ్వవ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తున్న శ్రేయశ, రాకేష్ ప్రజాపతి (ఆనంద్, గుజరాత్) వేరోనికా కమాని దశనాయక (శ్రీలంక)అలీఫ్ స్క్వాడ్ టీం (బంగ్లాదేశ్) సరిగమప లిటిల్ ఛాంప్స్ ఫైనలిస్ట్ మహాన్స్ సా
యి రెడ్డి( హైదరాబాద్ )లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ జానకి రెడ్డి (విశాఖ) ఆర్. హెచ్.టీనా,జి డింపుల్,బి. పూజిత(విశాఖపట్నం )ల బృందం కళా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు..
కమల్ బెయిడ్ కు "లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు" ప్రముఖ సామాజిక కార్యకర్త, అంతర్జాతీయ వాకర్స్ క్లబ్ సారధి అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు దేశ,విదేశాల్లో అందుకున్న డాక్టర్ కమల్ బెయిడ్ కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు 2026 ను ప్రధానం చేయనున్నామని తెలిపారు.అదే విధంగా సాంకేతిక సౌకర్యాలు లేని సమయంలో కూడా "నగరదర్శిని" పేరిట సుమారురెండున్నర దశాబ్దాల క్రితం విశాఖ వాసులకు చక్కని క్వాలిటీతో వార్తా విశేషాలను అందించిన సిటీ కేబుల్ న్యూస్ ప్రజెంటర్ సినీ ఎడ్యుకుటీవ్ ప్రాడ్యూసర్ కుర్రా విజయ్ కుమార్ కు ఎలాక్ట్రానిక్ మీడియా లెజెండ్ పురస్కారాన్ని అందించనున్నమ్మన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బ్రహ్మకుమారి రమేశ్వరి, వేరొనిక కమాని దస్సనాయక (శ్రీ లంక )శ్రేయషా, రాకేష్ ప్రజాపతి (గుజరాత్ )లు పాల్గున్నారు. ఈ సందర్బంగా ప్రతిభ కు ప్రోత్సాహం పోస్టర్ ను ఆవిష్కరించారు.



Comments
Post a Comment