ఓల్డ్‌టౌన్ 39వ వార్డులో హజ్రత్ సయ్యద్ అలీ ఇషాక్ మదనీ ఔలియా (ర.అ) 769వ ఉర్స్ మహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస్ *
విశాఖ:విశాఖ దక్షిణ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస్ గారు నేడు ఓల్డ్‌టౌన్ 39వ వార్డులోని హజ్రత్ సయ్యద్ అలీ ఇషాక్ మదనీ ఔలియా (రహ్మతుల్లాహి అలైహి) దర్గా 769వ ఉర్స్ మహోత్సవాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో ఉర్స్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస్ గారు దర్గాలో చాదర్ సమర్పించి ఫాతేహా నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రజల శాంతి, సౌభ్రాతృత్వం, సుభిక్షం, అభివృద్ధి మరియు సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఉర్స్ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ హజ్రత్ సయ్యద్ అలీ ఇషాక్ మదనీ ఔలియా (ర.అ) ఆధ్యాత్మిక వారసత్వాన్ని భావితరాలకు అందిస్తున్న దర్గా కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవం, సోదరభావంతో కలిసి జీవించడం విశాఖ నగర ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, భక్తుల సౌకర్యార్థం దర్గాకు లిఫ్ట్ సౌకర్యం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఈ దర్గాను విశాఖపట్నంలోని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి మరింత ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడిపి ఇన్చార్జెస్ శ్రీ సుధాకర్ గారు, జనసేన ఉత్తరాంధ్ర సహ-కన్వీనర్, మాజీ జి.వి.ఎం.సి కార్పొరేటర్ (39వ వార్డు), మాజీ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు డాక్టర్ మహ్మద్ సాదిక్ గారు , హీరా గారు, మొయినుద్దీన్ గారు, దర్గా కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు భారీ సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments
Post a Comment