Skip to main content

విశాఖలో జూన్ 5న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్.

                      K.V.SHARMA EDITOR 


విశాఖపట్నం, జూన్ 3: రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జూన్ 5న విశాఖ లో పర్యటించనున్న సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ బుధవారం రాత్రి పలు ఏర్పాట్లను నావెల్ కమాండర్ మనోజ్ కుమార్ , జీవీఎంసీ అదనపు కమిషనర్ పి.నల్లనయ్య, సౌత్ జోన్ జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడుతో కలిసి పరిశీలించారు.


ఈ పర్యటనలో నేవెల్ కోస్టల్ బ్యాటరీ పరిసర ప్రాంతంలో హెలిపాడ్ ప్రాంతాన్ని, సమీపంలో చేపట్టవలసిన పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటనలు ప్రాంతాల్లో రోడ్లు పరిశుభ్రత, పచ్చదనం, పారిశుధ్య విధులు తదితర పనులపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అదనప కమిషనర్ నల్లనయ్యకు, జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడుకు కమిషనర్ ఆదేశించారు. 


బీచ్ ప్రాంతంలో ముఖ్యమంత్రి పర్యటించే అవకాశాలు ఉన్నందున మరింత జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. నేవల్ కమాండర్ మనోజ్ కుమార్ తో మాట్లాడుతూ హెలిపాడ్ ప్రాంతంలో చేపట్టవలసిన జాగ్రత్తలపై కమిషనర్ చర్చించి వివరాలను అడిగి తెలుసుకున్నారు .

పౌర సంబంధాల అధికారి, జీవీఎంసీ

Comments