Skip to main content

*(అ)పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళణం.* 👉మళ్లీ మళ్లీ ఇది రాని రోజు 👉50 ఏళ్ల తర్వాత కలుసుకున్న పాత స్నేహితులు 👉ఆటపాటలు తో సంతోషంగా గడిపిన వృద్దులు 👉గోల్డెన్ జూబ్లీ జరుపుకున్న 1975-76 సంవత్సరం టెన్త్ క్లాస్ బ్యాచ్

 ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయి.  తను చదువుకునే రోజులు... చేసే అల్లరి... స్నేహితుల కోసం చేసే ఫైటింగ్లు... వారితో కలిసి ఆడిన ఆటలు... చిన్న చిన్న గ్యాంగ్లు... అవన్నీ ఓ మధురమైన క్షణాలు.   మళ్లీ అవన్నీ గుర్తు చేసుకోవటానికి 50 వసంతాల తర్వాత కలుసుకుని ఆనందంగా గడిపారు పాతనగరం ఎంవీడీఎం ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు.*


 విశాఖనగరం ఓల్డ్ సిటి కురుపాం మార్కెట్ ప్రాంతంలో గల  ఎం.వీ.డీ.ఎం. ఉన్నత పాఠశాలలో 1975-76 లో పదవతరగతి పూర్తి చేసుకున్న వీరంతా 50 వసంతాలు పూర్తైన సందర్భంగా గోల్డెన్ జూబ్లి వేడుకలు నిర్వహించేందుకు ముందుగా ఓ ప్రాంతంలో కలిశారు. ఆ తర్వాత ఆదివారం నాడు విద్యనభ్యసించిన పాఠశాలకు చేరారు. పాతరోజులు గుర్తుకు తెచ్చుకున్నారు. ఎవరెవరు....ఎక్కడ ఉన్నారు.. ఏ స్థాయిలో ఉన్నారు... ఆరోగ్యం... పిల్లలు... కుటుంబం... ఉద్యోగం... ఉపాధి... ఇలా అన్ని విషయాలు ఒకరికొకరు తెలుసుకున్నారు. అప్పటి అధ్యాపకులు నేర్పిన పాఠాలు...నేర్పించిన పద్దతులు గుర్తుచేసుకుని ఆనందంతో తేలియాడారు.   ఈ బ్యాచ్ విద్యార్థుల్లో

అనేక మంది ఉన్నత విద్యనభ్యసించి వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల్లో దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నత స్థానాలధిరోహించిన వారు, వివిధ వ్యాపార రంగాల్లో స్ధిరపడ్డవారు ఉన్నారు.   పాఠశాలలో అడుగిడిన వెంటనే అందరూ ఒక్కసారిగా చిన్ననాటి రోజులు గుర్తుతెచ్చుకుని ఉత్సాహంగా రోజంతా గడిపారు.  అప్పట్లో విద్యనొసంగిన  ఉపాధ్యాయులను మనసారా గుర్తుచేసుకుని గురుభక్తి చాటుకున్నారు. పాత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుని ఉల్లాసంగా గడిపారు. 

సుమారు 60 మంది పూర్వ విద్యార్థులు తమ తమ కుటుంబ సభ్యులతో హాజరైన వారంతా ఆటలు, పాటలు, చిన్న చిన్న సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సహపంక్తి భోజనాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అప్పటి విద్యార్ధి వంకాయల రమేష్ సేకరించిన కరెన్సీ నోట్లు,  నాణెముల ప్రదర్శన అందరినీ అలరించింది.

కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రస్తుత హెడ్మాస్టర్ శ్రీమతి నిరజ ఇన్చార్జి హెడ్మాస్టర్ శ్రీమతి స్రవంతి గార్లను కలిసి అప్పట్లో స్కూలు వాతావరణం, సదుపాయాలు, ఆనాటి గురువులతో తమ అనుబంధం గురించి వారి మనోగతాన్ని పంచుకొని వారిరువురిని ఘనంగా సత్కరించారు.  అనంతరం తమకు విద్యనందించిన  స్కూలుకు ఆరు క్రాంప్టన్  సీలింగ్ ఫ్యాన్ లు బహూకరించారు.  భవిష్యత్తులో పూర్వ విద్యార్థులందరూ చర్చించుకుని మరింత సహాయం అందిస్తామని చెప్పారు.  

ప్రతీ సంవత్సరం ఇటువంటి సమావేశాలు నిర్వహించుకుంటామని చెప్పారు.

చివరగా ఆనాటి విద్యార్ధులందరూ (నేటి వృద్దులు) సామూహిక జాతీయగీత వందన సమర్పణలో కార్యక్రమం ముగిసింది.

                     K.V.Sharma EDITOR 

Comments