జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50% రాయితీ* *తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు* *ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి నివేదిస్తా* *తెల్ల రేషన్ కార్డుదారులకు* *ఆరోగ్య భీమా ప్రీమియం చెల్లింపు* *జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల*
విశాఖ జిల్లా :కలెక్టర్ కార్యాలయం: విశాఖపట్నం జూన్ 15,విశాఖ జిల్లాలో అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు స్కూల్స్.. కళాశాలల ఫీజులో 50% రాయితీ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్.. ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్.. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ లు సంయుక్తంగా జిల్లా కలెక్టర్ అభిసిక్త్ కిషోర్ కు
వినతి పత్రం సమర్పించాయి.. సోమవారం జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి.. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు
విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయనను కలుసుకుని జర్నలిస్టులకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు.. 2014 నుంచి జర్నలిస్టుల పిల్లలకు కొన్ని సందర్భాల్లో 100% మరికొన్నిసార్లు 50% స్కూల్ ఫీజు
రాయితీ ఇస్తున్నట్లు కలెక్టర్ కు వివరించారు.. గత ఏడాది అప్పటి కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను పరిశీలించిన అనంతరం వెంటనే ఈ ఏడాదికి సంబంధించి కూడా అవసరమైన ప్రొసీడింగ్స్ జారీ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. అలాగే జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాలు సమస్యను కూడా వివరించగా ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.. ఆరోగ్య బీమాకు సంబంధించి తెల్లరేషన్ కార్డుదారులకు.. వెటరన్ జర్నలిస్టులకు సి ఎస్ ఆర్ నిధులతో ప్రీమియం చెల్లిస్తామన్నారు.. పెన్షన్ సదుపాయం... ప్రమాద బీమా పునరుద్ధరణ వంటి అంశాలను వినతి పత్రం ద్వారా కలెక్టర్ కు తెలియజేశామని గంట్ల శ్రీనుబాబు చెప్పారు.. జర్నలిస్టుల పిల్లల స్కూల్ ఫీజు రాయితీ ఉత్తర్వులు వెంటనే జిల్లా విద్యాశాఖ ద్వారా జారీకానున్నట్లు చెప్పారు.. ఇతర సమస్యలు పరిష్కారానికి తమ
యూనియన్ ద్వారా కృషి చేస్తున్నామన్నారు..
ఈ కార్యక్రమంలోఫెడరేషన్ కార్యదర్శి జి శ్రీనివాస్ రావు ..ఆర్గనైజింగ్ సెక్రటరీ డి రవికుమార్,ఉపాధ్యక్షులు శివప్రసాద్ నగేష్, కృష్ణమూర్తి బ్రాడ్ కాస్ట్ అధ్యక్ష, కార్యదర్శులు ఈశ్వరరావు, మదన్, స్మాల్ పేపర్స్ అధ్యక్ష, కార్యదర్శులు జగన్మోహన్, శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు బొబ్బర్ ప్రసాద్, ఆనంద్, అరుణ్ భాస్కర్, రాజశేఖర్, చంద్రశేఖర్, సత్యనారాయణ, అప్పలనాయుడు, భాస్కర్, డిఎన్ఎస్ రెడ్డి, సతీష్, కృష్ణమూర్తి, రమేష్, గౌతమ్, వినయ్,, రమణ, సింహాద్రి,

Comments
Post a Comment