Skip to main content

శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విశాఖపట్నం జిల్లా. సేవా విలువలతో నైపుణ్య వికాసం – 600 మంది శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్‌మెంట్ పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం

.                    K.V.SHARMA EDITOR 
విశాఖపట్నం :  విశాఖ సందేశం వార్తలు :జూన్ 14: శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ (SDPs)లో శిక్షణ పొందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నేడు విశాఖపట్నంలోని రైల్వే ఇన్‌స్టిట్యూట్ హాలులో ఘనంగా నిర్వహించబడింది. వివిధ వృత్తులకు చెందిన సుమారు 550 మంది పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.


ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తాము పొందిన శిక్షణ ద్వారా ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకున్నారో వివరించారు. అంతేకాకుండా, శిక్షణ ద్వారా మానవతా విలువలు, సేవాభావం, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలను తమ జీవితాల్లో ఎలా ఆచరిస్తున్నారో హృదయాన్ని హత్తుకునే విధంగా వెల్లడించారు.


కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశాఖపట్నం ACP (Crimes) శ్రీమతి భవ్య రెడ్డి గారు మాట్లాడుతూ, నేటి యువత సంప్రదాయ నైపుణ్యాలతో పాటు డిజిటల్ మార్కెటింగ్ వంటి ఆధునిక నైపుణ్యాలను కూడా అభ్యసించి తమ ఉపాధి అవకాశాలను మరింత విస్తరించుకోవాలని సూచించారు.


శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు గారు తన ఉత్తేజభరిత ప్రసంగంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బోధించిన మానవ విలువలు, సేవా తత్వం మరియు నైపుణ్యాభివృద్ధి ప్రాముఖ్యతను వివరించారు. 


నైపుణ్యంతో కూడిన సేవా దృక్పథమే సమాజాభివృద్ధికి నిజమైన పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు.


ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుండి హెల్త్ కేర్ అసిస్టెంట్ శిక్షణా కార్యక్రమం నిర్వహించేందుకు లభించిన అనుమతి పత్రాన్ని సభాముఖంగా ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్ష


Comments