Skip to main content

ఓటు హక్కును పరిరక్షించుకోండి – 68వ వార్డ్ వైస్సార్సీపీ అధ్యక్షులు హుస్సేన్..

                     K.V.SHARMA EDITOR 


విశాఖపట్నం: విశాఖ సందేశం వార్తలు: జూన్ 19భారత్ ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా, గాజువాక నియోజకవర్గం 68 వ వార్డు వైస్సార్సీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు హుస్సేన్  గారు ఈరోజు స్వయంగా SIR దరఖాస్తు ఫారాన్ని  అందచేశారు .  

ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడుతూ, ఇంటింటికీ వస్తున్న బూత్ లెవల్ అధికారులు (BLOలు) మరియు ఎన్నికల సిబ్బందికి ప్రజలందరూ పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు SIR ఫారాన్ని సక్రమంగా నింపి అవసరమైన వివరాలు అందించాలని సూచించారు.

ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన హక్కు అని, ఎవరూ తమ పేరు ఓటరు జాబితా నుండి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. 68వార్డ్ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును కాపాడుకోవాలని ఆయన కోరారు . ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న SIR ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హుస్సేన్ గారితో పాటు బిఎల్ఓ సిబ్బంది గౌరీ, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు రవి, sk హంసరవెల్లి, తదితరులు పాల్గొన్నారు..

Comments