Skip to main content

సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాలలో జూలై 7, 8 తేదీల్లో భాషా–సాహిత్య వికాసంలో కృత్రిమ మేధ oపాత్రపై బహుభాషా అంతర్జాతీయ సదస్సు

.                  కె.వి. శర్మ, సంపాదకుడు
విశాఖపట్నం :విశాఖపట్నంలోని జ్ఞానాపురం సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాలలో జూలై 7, 8 తేదీల్లో “భాషా–సాహిత్య వికాసంలో కృత్రిమ మేధ (Artificial Intelligence) పాత్ర” అనే అంశంపై రెండు రోజుల బహుభాషా అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ షైజీ తెలిపారు.

సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల భాషా విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సదస్సుకు సంబంధించిన బ్రోచర్, గోడపత్రికను ఆమె ఇటీవల జరిగిన సమావేశంలో ఆవిష్కరించారు. కృత్రిమ మేధ యుగంలో భాషలు, సాహిత్యాల అభివృద్ధి, పరిరక్షణ, విస్తరణ వంటి అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్య వేదికగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు.


భాషా–సాహిత్య వికాసంలో కృత్రిమ మేధ (Artificial Intelligence) పాత్ర” అనే అంశంపై తెలుగు, హిందీ, సంస్కృతం, ఫ్రెంచ్ మరియు ఆంగ్ల భాషల్లో సదస్సును నిర్వహిస్తున్నట్లు సదస్సు కన్వీనర్, కళాశాల పీ ఆర్  వో, పూర్వ ద్వితీయ భాషల విభాగాధిపతి డాక్టర్ పి.కె. జయలక్ష్మి తెలిపారు.

కృత్రిమ మేధ యుగంలో నిర్వహిస్తున్న ఈ సదస్సు విశేష ప్రాముఖ్యతను సంతరించుకుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా యూరప్, జర్మనీ, అమెరికా తదితర దేశాల నుంచి పలువురు సాహితీవేత్తలు, మేధావులు పాల్గొననున్నట్లు తెలిపారు.


ఈ సదస్సుకు వంద మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని ఆమె వెల్లడించారు. ఆసక్తి గల వారు మరిన్ని వివరాల కోసం 94736 26889 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

సదస్సు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడుతుందని కన్వీనర్ డాక్టర్ పి.కె. జయలక్ష్మి తెలిపారు.

Comments