డెంగ్యూ, మలేరియా నివారణకు ప్రతి శుక్రవారం 'డ్రై డే' పాటించాల – జీవీఎంసీ గాజువాక జోనల్ కమిషనర్ బి.ఆర్.ఎస్. శేషాద్రి. 70, 71 వార్డులలో డ్రై డే కార్యక్రమం, యాంటీ లార్వల్ ఆపరేషన్, వ్యాపార సంస్థల పరిశుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నియంత్రణపై అవగాహన.
. K.V.SHARMA EDITOR
విశాఖపట్నం, జూన్ 12: విశాఖ నగరంలో డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ప్రతి శుక్రవారం 'డ్రై డే' కార్యక్రమాన్ని ప్రజలందరూ పాటించాలని, వ్యాపార సంస్థల పరిశుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నియంత్రణకు ప్రజలు సహకరించాలని జీవీఎంసీ గాజువాక జోనల్ కమిషనర్ బి.ఆర్.ఎస్. శేషాద్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వార్డు నెం.71 ఎర్రగెడ్డ కాలనీలో నిర్వహించిన డ్రై డే కార్యక్రమంలో విద్యార్థులు, స్థానిక నివాసితులకు యాంటీ లార్వల్ ఆపరేషన్ (ALO) కార్యకలాపాలపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పూల కుండీలు, కూలర్లు, కొబ్బరి చిప్పలు, టైర్లు వంటి ప్రదేశాల్లో దోమల లార్వా పెరగకుండా వారానికి ఒకరోజు తప్పనిసరిగా డ్రై డే పాటించాలని సూచించారు.
అనంతరం జోనల్ కమిషనర్ సంయుక్త తనిఖీలు నిర్వహించి వార్డు నెం.70 దిబ్బపాలెం లో ఇంటింటి చెత్త సేకరణ విధానం, కాలువల పూడికతీత పనులు, వ్యాపార సంస్థల పరిశుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (SUP) నియంత్రణ చర్యలను పరిశీలించారు. వ్యాపారులతో, స్థానిక ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలు తెలుసుకుని పరిశుభ్రతకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జీవీఎంసీ సహాయ వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, శానిటేషన్ సిబ్బంది, విద్యార్థులు, వ్యాపారులు, స్థానిక నివాసితులు మరియు ఇతర జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు.

శుక్రవారం ఆయన సహాయ వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్‌తో కలిసి గాజువాక జోన్ పరిధిలోని వార్డు నెం.70 దిబ్బపాలెం, వార్డు నెం.71 ఎర్రగెడ్డ కాలనీ ప్రాంతాల్లో పలు పారిశుద్ధ్య, ప్రజారోగ్య చర్యలను పరిశీలించి పలు కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా వార్డు నెం.71 ఎర్రగెడ్డ కాలనీలో నిర్వహించిన డ్రై డే కార్యక్రమంలో విద్యార్థులు, స్థానిక నివాసితులకు యాంటీ లార్వల్ ఆపరేషన్ (ALO) కార్యకలాపాలపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పూల కుండీలు, కూలర్లు, కొబ్బరి చిప్పలు, టైర్లు వంటి ప్రదేశాల్లో దోమల లార్వా పెరగకుండా వారానికి ఒకరోజు తప్పనిసరిగా డ్రై డే పాటించాలని సూచించారు.
అనంతరం జోనల్ కమిషనర్ సంయుక్త తనిఖీలు నిర్వహించి వార్డు నెం.70 దిబ్బపాలెం లో ఇంటింటి చెత్త సేకరణ విధానం, కాలువల పూడికతీత పనులు, వ్యాపార సంస్థల పరిశుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (SUP) నియంత్రణ చర్యలను పరిశీలించారు. వ్యాపారులతో, స్థానిక ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలు తెలుసుకుని పరిశుభ్రతకు సహకరించాలని కోరారు.
పరిశుభ్రమైన పరిసరాలు, ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, జీవీఎంసీ చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని జోనల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. అలాగే స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో విశాఖ నగరాన్ని దేశంలోనే అగ్రగామి పరిశుభ్ర నగరంగా నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జీవీఎంసీ సహాయ వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, శానిటేషన్ సిబ్బంది, విద్యార్థులు, వ్యాపారులు, స్థానిక నివాసితులు మరియు ఇతర జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి, జీవీఎంసీ

.jpeg)
.jpeg)
.jpeg)
Comments
Post a Comment