అనకాపల్లి ఎంపీ క్యాంపు కార్యాలయంలో రూ. 8,16,086 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎం.పీ సిఎం రమేష్*
K.V.SHARMA EDITOR
ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఆపదలో ఉన్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఎంతో అండగా నిలుస్తోందని రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్
ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఆపదలో ఉన్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఎంతో అండగా నిలుస్తోందని రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్
అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ గారు అన్నారు.మంగళవారం అనకాపల్లి ఎంపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం రూ. 8,16,086 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు ఆయన అందజేశారు. అనారోగ్యం, ప్రమాదాలు మరియు ఇతర అత్యవసర వైద్య అవసరాల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ అవసరమైన సహాయాన్ని అందిస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైన బాధిత కుటుంబాలకు సకాలంలో ఆర్థిక సహాయం అందడం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. లబ్ధిదారులు తమకు అందిన సహాయానికి కూటమి ప్రభుత్వనికి పార్లమెంట్ సభ్యులు సిఎం రమేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.




Comments
Post a Comment