Skip to main content

సెయింట్ జోసెఫ్ కళాశాల లో ఏజెంటిక్ AI, సైబర్ సెక్యూరిటీ & క్వాంటమ్ కంప్యూటింగ్‌పై ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభం

.                  K.V.SHARMA EDITOR 
విశాఖపట్నం :  విశాఖ సందేశం: 
సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల IQAC ఆధ్వర్యంలో, ఎడ్యునెట్ ఫౌండేషన్ (IBM విశాఖపట్నం CSR) సహకారంతో నిర్వహిస్తున్న “ఏజెంటిక్ AI, సైబర్ సెక్యూరిటీ & క్వాంటమ్ కంప్యూటింగ్” అంశాలపై ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది.


కార్యక్రమ ప్రారంభంలో ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభోత్సవ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. కళాశాల ఉప ప్రిన్సిపాల్ డా. సిస్టర్ హేమ అతిథులను ఆహ్వానించి స్వాగతం పలికారు. IQAC కోఆర్డినేటర్ డా. టి. భాస్కర సుధ కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ కార్యక్రమానికి IBM కీ అకౌంట్ మేనేజర్ శ్రీమతి లలితేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలు భవిష్యత్ విద్యా మరియు ఉపాధి అవకాశాలను ప్రభావితం చేయనున్నాయని పేర్కొన్నారు. అధ్యాపకులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాలను అవగాహన చేసుకుని విద్యార్థులకు అందించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. పరిశ్రమ–విద్యా సంస్థల భాగస్వామ్యంతో ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అధ్యాపకుల నైపుణ్యాలు మరింత మెరుగుపడతాయని తెలిపారు.


అనంతరం రిసోర్స్ పర్సన్ శ్రీ అశ్విని కుమార్ మోటపోతుల ఏజెంటిక్ AI, సైబర్ సెక్యూరిటీ మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లోని తాజా పరిణామాలు, అవకాశాలు, సవాళ్లపై అవగాహన కల్పించారు.


ఈ ఐదు రోజుల శిక్షణా కార్యక్రమంలో కళాశాలలోని వివిధ విభాగాలకు చెందిన 120 మంది అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అధ్యాపకుల బోధన, పరిశోధన, ఆవిష్కరణ సామర్థ్యాలు మరింత మెరుగుపడనున్నాయని నిర్వాహకులు తెలిపారు.


ఈ విషయాన్ని కళాశాల ప్రజాసంబంధాల అధికారి డా. పి.కె. జయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.

Comments