ఈరోజు ఆంధ్రా యూనివర్సిటీ (AU) కన్వెన్షన్ హాల్, బీచ్ రోడ్‌లో అత్యంత ఘనంగా నిర్వహించిన *మోదీ గారి 12 ఏళ్ల సుపరిపాలన –కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” విజయోత్సవ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారు* పాల్గొన్నారు.
. కె. వి. శర్మ, ఎడిటర్,
విశాఖపట్నం: విశాఖ సందేశం వార్తలు :జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో గౌరవ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రివర్యులు శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి గారు, విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ గారు, గాజువాక ఎమ్మెల్యే & టీడీపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, భీమిలి ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు గారు,ఉత్తర ఎమ్మెల్యే & బిజెపి ఫ్లోర్ లీడర్ శ్రీ పి విష్ణు కుమరాజు గారు,పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ గణబాబు గారు, దక్షిణ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు,*బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామ రాజు గారు*, మరియు
టీడీపి జిల్లా అధ్యక్షులు శ్రీ పట్టాభి గారితో పాటు కూటమి ప్రజాప్రతినిధులు, కీలక నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారు మాట్లాడుతూ, కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని 12 ఏళ్ల సుపరిపాలన భారతదేశ రూపురేఖలను మార్చడమే కాకుండా, విశాఖపట్నం అభివృద్ధికి స్వర్ణయుగంగా నిలిచిందని కొనియాడారు.
"మోదీ గారి నాయకత్వంలో విశాఖకు రూ. వేల కోట్లతో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, ఎయిమ్స్ (AIIMS) స్థాయి వైద్య సదుపాయాలు, పెట్రోలియం యూనివర్సిటీ, ఐఐఎం (IIM) లాంటి ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థలు వచ్చాయి. విశాఖ పోర్ట్ ఆధునికీకరణ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్రం ఇస్తున్న అపారమైన మద్దతు, వందే భారత్ రైళ్లు.. ఇలా దేశం గర్వించదగ్గ అనేక మెగా ప్రాజెక్టులను మోదీ గారు విశాఖకు అందించారు.
వీటన్నింటితో పాటు, ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసిందని గుర్తుచేశారు. విశాఖకు తలమానికమైన వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను సంక్షోభం నుండి గట్టెక్కించి, దానిని మళ్లీ పూర్తిస్థాయి అభివృద్ధి బాటలోకి నడిపించేందుకు కేంద్రం అండగా నిలిచిందన్నారు.
భవిష్యత్తు అంతా విశాఖదే అనడానికి నిదర్శనంగా.. గ్లోబల్ జెయింట్స్ అయిన ఆర్సీలర్ మిట్టల్ (ArcelorMittal) భారీ పెట్టుబడులు, అత్యాధునిక సాంకేతికతతో కూడిన గూగుల్ డేటా సెంటర్ (Google Data Center), మరియు పర్యావరణహిత ఇంధన వనరుల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మక గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు విశాఖకు రావడం మోదీ గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వ సంయుక్త కృషి వల్లే సాధ్యమైంది" అని మాధవ్ గారు స్పష్టం చేశారు.
కేంద్రంలోని మోదీ గారి మార్గదర్శకత్వంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్లలో విశాఖ నగరం మరియు జిల్లాను సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని మాధవ్ గారు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన, ఐటీ, పరిశ్రమలు, పర్యాటక రంగాల అభివృద్ధిలో ప్రభుత్వం విశేష పురోగతి సాధించిందన్నారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా పారదర్శక పాలన అందిస్తూ, అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా మహిళలకు అండగా నిలుస్తూనే, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల (దీపం) పథకం ద్వారా కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించే విప్లవాత్మక చర్యలు చేపట్టిందన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కృషితో (డబుల్ ఇంజన్ గ్రోత్) రానున్న మూడేళ్లలో విశాఖపట్నం మరింత వేగంగా అభివృద్ధి చెందనుందని, మరో ఐదేళ్లలో విశాఖ నగర రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
రెండేళ్ల నమ్మకం” కార్యక్రమం సంక్షేమం, అభివృద్ధి సాధనలో ప్రభుత్వ విజయాలను ప్రతిబింబిస్తోందని పేర్కొన్న ఆయన, ఈ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో బీజేపీ, జనసేన, టిడిపి కూటమి నాయకులు, కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతో విశాఖను దేశంలోనే నంబర్ 1 ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతామని శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారు స్పష్టం చేశారు.


Comments
Post a Comment