Skip to main content

BJYM ఆధ్వర్యంలో CMR సెంట్రల్ లో మోదీ 12 ఏళ్ల పాలన విజయాలను ప్రజలకు వివరించే ప్రదర్శన*

                            కె. వి. శర్మ, ఎడిటర్,


 విశాఖపట్నం:విశాఖ సందేశం వార్తలు: ఈరోజు 20 -06 -2026 శనివారం ఉదయం మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల సుపరిపాలన  పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షులు ఇప్పిలి భాను మూర్తి మరియు మైనారిటీ మోర్చ జిల్లా అధ్యక్షులు షేక్ నూర్ భాషా షరీఫ్ ఆధ్వర్యంలో ఫోటో ఎక్సబిషన్  ఏర్పాటు చేశారు. బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ విచ్చేసారు.


ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు మాట్లాడుతూ మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. ఈ ప్రదర్శనలో కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు  విశాఖపట్నం జిల్లాకు అందించిన ప్రాజెక్టులు, నిధుల వివరాలను ప్రజలకు తెలియజేశారు.


ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు మాట్లాడుతూ   పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని అభివృద్ధి, విశాఖపట్నం రైల్వే జోన్ వంటి కీలక ప్రాజెక్టులతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని తెలిపారు. విశాఖ జిల్లాకు  రైల్వే జోన్, గూగుల్ డేటా సెంటర్ ద్వారా వంటి కార్యక్రమాలు జిల్లాలో ఉపాధి అవకాశాలను పెంచనున్నాయని పేర్కొన్నారు. అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా సమాజంలోని చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. జల్ జీవన్ మిషన్ వంటి పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.


దేశంలో డిజిటల్ లావాదేవీల విస్తరణకు మోదీ ప్రభుత్వం చేపట్టిన డిజిటలైజేషన్ కార్యక్రమాలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. ఒకప్పుడు విమర్శలు ఎదుర్కొన్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ నేడు ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగిస్తున్న దేశంగా భారత్‌ను నిలిపిందన్నారు. చిన్న వ్యాపారుల నుంచి సామాన్య ప్రజల వరకు ఫోన్‌పే, యూపీఐ, క్యూ ఆర్ కోడ్‌ల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారని తెలిపారు.


భారతదేశాన్ని 2047 నాటికి ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం అమృతకాల దిశగా పనిచేస్తోందని, దేశాన్ని శక్తివంతమైన, స్వయం సమృద్ధి కలిగిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రదర్శనను విద్యార్థులు, యువత  పెద్ద సంఖ్యలో సందర్శించి కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పొందాలని కోరారు.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కేతినేని సురేంద్ర మోహన్, ఉమ్మిడి సుజాత రాజ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా.K సుహాసిని ఆనంద్, బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానెలిస్ట్ KNP చక్రవర్తి, బీజేపీ పార్వతీపురం జిల్లా ఇంచార్జి SVS ప్రకాష్ రెడ్డి, బీజేపీ శ్రీకాకుళం జిల్లా ఇంచార్జి N విజయానంద రెడ్డి, మరియు అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments