పారిశుద్ధ్య పనుల నిర్వహణను మరింత మెరుగుపరచండి.. • ఎయిర్పోర్ట్ అనుసంధాన రోడ్ల అభివృద్ధిని త్వరితగతిన పూర్తి చేయండి. • నగర సుందరీకరణ, పచ్చదనం అభివృద్ధిలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టండి. -జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.
K.V.SHARMA EDITOR
విశాఖపట్నం, జూన్ 2: విశాఖ నగర పరిధిలో పారిశుధ్య పనుల నిర్వహణను , నగర సుందరీకరణ దిశగా పచ్చదనం మరింత మెరుగుపరచాలని, పరిసరాల పరిశుభ్రత, వ్యర్ధాలు విభజన పై ప్రజలకు అవగాహన కల్పించి నగర పరిశుభ్రతకు, సుందరీకరణకు అధిక ప్రాధాన్యత నివ్వాలని జీవీఎంసీ ప్రజారోగ్య అధికారులను, ఇంజనీరింగ్ అధికారులను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. మంగళవారం ఆయన జీవీఎంసీ ఈస్ట్, సౌత్, పెందుర్తి జోన్లలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ, రోడ్లు, పచ్చదనం అభివృద్ధి పై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ ఈస్ట్ జోన్ లో 27వ వార్డు లో ద్వారకా నగర్ పరిసర ప్రాంతాల్లో, సౌత్ జోన్ 30 వ వార్డులో రెల్లి వీధి, జిల్లా పరిషత్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో, పెందుర్తి జోన్ 94 వ వార్డులో శ్రీకాంత్ నగర్ ప్రాంతాల్లో పారిశుధ్య పనుల నిర్వహణ, రోడ్ల అభివృద్ధి పనులను పరిశీలించారు. పలుచోట్ల రోడ్లపై వ్యర్ధాలను గమనించిన కమిషనర్ వ్యర్ధాల సేకరణ, తరలింపు ప్రక్రియపై వార్డ్ శానిటేషన్ కార్యదర్శులను ఆరా తీసి ,రోడ్లపై , వీధులలో ,కాలనీలలో గార్బేజ్ వల్నరబుల్ ప్రదేశాలు ఉంటే సహించేది లేదని , నిత్యం ఇంటింటి నుండి వ్యర్ధాల సేకరణ శత శాతం జరిపి తరలించే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు.
వ్యర్ధాలను తరలించే వాహనాల డ్రైవర్లతో మాట్లాడుతూ రోజు ఎన్ని ట్రిప్పులు వ్యర్ధాలు తరలిస్తున్నారని అడిగి తెలుసుకుని ,వారి విధి విధానాలను పరిశీలించి పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. పలుచోట్ల నివాసితులతో మాట్లాడుతూ రోజు వ్యర్ధాల సేకరణకు పారిశుధ్య కార్మికులు, క్లాప్ వాహనాలు వస్తున్నాయా లేదా అని ఆరా తీసి వివరాలను అడిగి తెలుసుకొని నాలుగు డస్ట్ డస్ట్ బిన్లలో వ్యర్ధాలను వేరు చేసి నిత్యం అందిస్తూ నగర పరిశుభ్రతకు సహకరించాలని కమిషనర్ వారికి సూచించారు.
అనంతరం పెందుర్తి జోను నాయుడు తోట జంక్షన్ వద్ద పరిసరాలను పరిశీలిస్తూ , వేపగుంట జుత్తాడ, వేపగుంట పినగాడి రోడ్డు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, నగర సుందరీకరణ, పచ్చదనం అభివృద్ధికి ప్రాధాన్యత దిశగా హార్టికల్చర్ విభాగానికి సంబంధించిన హార్టికల్చర్ ఆఫీసర్లు నిత్యం ఉదయం 7:00 గంటలకు వార్డులలో పర్యటిస్తూ హార్టికల్చర్ పనుల నిర్వహణను మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని పర్యవేక్షక ఇంజనీర్ కె .శ్రీనివాసరావును కమిషనర్ ఆదేశించారు.
పౌర సంబంధాల అధికారి ,జివిఎంసి




Comments
Post a Comment