మల్లేశ్వరి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి : శ్రీ వెంకటేశ్వర కాలేజ్ కరస్పాండెంట్ కె.వి.ఆర్.ఎన్.నరసింహరావు మల్లేశ్వరని ఘనంగా సన్మానించిన కాలేజీ యాజమాన్యం...
. SRINIVAS SPL Correspondant
అమలాపురం, విశాఖ సందేసం...మల్లేశ్వరి విశ్వావిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అమలాపురం శ్రీ వెంకటేశ్వర కాలేజ్ కరస్పాండెంట్ కె.వి.ఆర్.ఎన్.నరసింహరావు ఆకాంక్షించారు.
ఏపీ పీజీ సెట్ లో రాష్ట్ర స్థాయి 5వ ర్యాంకు సాదించిన శ్రీవెంకటేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థి లూటుకుర్తి బేబీ దుర్గా మల్లేశ్వరికి కళాశాల కరస్పాండెంట్ కె.వి.ఆర్.ఎన్.నరసింహరావు ఆధ్వర్యంలో దుస్సాలువా కప్పి పుష్పగుచ్చాలను అందజేసి ఘనంగా సన్మానించారు. కరెస్పాండెంట్ కేఎన్ఆర్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర కాలేజీలో చదువుకొని ఏపీ పీజీ సెట్ లో ఐదో ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉందని, అత్యుత్తమ విశ్వవిద్యాలయంలో మల్లేశ్వరి విద్యను అభ్యసించి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి మంచి ఉద్యోగం సాధించలన్నారు. మల్లేశ్వరి మాట్లాడుతూ అసెట్ లో స్టేట్ 5వ ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉందని,
ఈ ర్యాంకు రావడానికి సహకరించిన తల్లిదండ్రులు శ్రీనివాస్ లక్ష్మి, ముఖ్యంగా కాలేజీ కరెస్పాండెంట్ కేఎన్ఆర్ సార్ కు కాలేజీ యాజమాన్యనికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. ఆంధ్ర యూనివర్సిటీలో ఎమ్.ఎస్.సి స్టేటస్టిక్స్ చదుకుని జాబ్ సాందించి ప్రజలకు సేవా చేయాలని అనుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో చైర్మన్ మల్లిపూడి విజయలక్ష్మి, కరాటం ప్రవీణ్,యాలంగి, కె. మనోహర్, వరప్రసాద్,కె.శ్రవణ్ దిలీప్, డాక్టర్ కె.హేమ విజిత పాల్గొన్నారు



Comments
Post a Comment