శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం. స్వర్ణపుష్పార్చన మహోత్సవం నేపథ్యంలో శని, ఆదివారాల్లో అంతరాలయ దర్శనాల సమయ మార్పు
K.V.SHARMA EDITOR
సింహాచలం, జూన్ 4, 2026 ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం, భక్తకోటి కల్పవృక్షం అయిన సింహాద్రి అప్పన్న సన్నిధిలో మే 23వ తేదీ నుండి అత్యంత వైభవోపేతంగా ప్రారంభమైన స్వర్ణపుష్పార్చన సేవకు భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది.
స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందేందుకు వేలాది మంది భక్తులు ఈ మహోత్కృష్ట సేవలో పాల్గొంటూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు.
స్వామివారి అంతరాలయంలోని భోగమండపంలో ప్రతి శని, ఆదివారాల్లో స్వర్ణపుష్పార్చన నిర్వహించబడుతున్న నేపథ్యంలో, ఆ సేవా కార్యక్రమాల నిర్వహణకు అనుగుణంగా ఉదయం నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు అంతరాలయ దర్శనాలు అందుబాటులో ఉండవు.
స్వామివారి సేవలు, ఆరాధనలు అత్యంత శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించేందుకు చేపట్టిన ఈ ఏర్పాట్లను భక్తులు అర్థం చేసుకుని దేవస్థానానికి సహకరించాలని విజ్ఞప్తి చేయడమైనది.
సింహాద్రి అప్పన్న కృపాకటాక్షాలు సర్వ భక్తులపై ఎల్లప్పుడూఉండాలని దేవస్థానం ఆకాంక్షిస్తోందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు తెలిపారు. ఆలయ స్థానాచార్యులు టి.పి. రాజగోపాల్ మరియు ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు కూడా భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని కోరారు


Comments
Post a Comment