ఆఖండ భారతీయ
ప్రజాస్వామ్యంలో
క్షేత్ర స్థాయి నుంచి
అదే గ్రామ పంచాయితీ
పదవి నుంచి
వార్డ్ కౌన్సిలర్,
వార్డ్ కార్పొరేటర్,
మేయర్,
MLC,
MLA,
MP, చివరకు
రాజ్య సభ
M.P. వరకూ
నోట్ల తోనే పని.
కోట్లు చూపించి
కురిపించి,
గుమ్మరించి
ధన, కుల బలం
ఉంటే చాలు,
అవే పదవులకు
ప్రాతి పదిక.
అవే మీ చెంతకు
వచ్చి మిమ్మల్ని
వరిస్తాయి.
విద్య, విజ్ఞానo,
సమాజ సేవ,
దాన ధర్మాలు,
ఇవేవి అర్హత కు
నోచుకోవు.
ఇదీ నేటి, మేటి
మన ప్రజాస్వామ్యం.
డబ్బున్న వాడికే
పదవి, వాడే రాజు
వాడికే పెద్ద పీట.
ఏ పార్టీ ఐనా
ఎంపిక తీరు
ఒక్కటే.
జన సేనాని
అందుకు తీసి
పోలేదు.
బంధు ప్రీతి,
కుల గజ్జి,
ధనం,
వంశ పారం పర్యం
పదవులకు
ప్రధాన
ప్రాధమిక
అర్హతలు.
వీళ్ళు మన
నాయకులు,
ప్రజా పాలకులు,
దేశోద్ధారకులు,
అరచేతిలో
స్వర్గం చూపించ
గల సమర్థులు.
ఓటరు నాడిని
పసిగట్టి
రాజకీయ పబ్బం
గడుపుకోగల
సమర్థులు.
రాజకీయం తో
వ్యాపారం
కోసమే రాజ్య
సభ సభ్యత్వం.
మళ్ళీ ఆస్తుల
ప్రకటనలు,
అవి అసంపూర్తిగా.
ఎటు పోతున్నాం
మనం. సామాన్యుడి
పయనం, గమ్యం
ఎటో తెలియని
వైనం, జీవన
గమ్యం అగమ్య
గోచరం.
కొనుక్కో,
ఏలుకో,
దండుకో,
దోచుకో,
దాచుకో,
ప్రకటించుకో
నువ్వు
దోచుకుని దాచుకున్న
ధనాన్ని
మళ్ళీ మళ్ళీ
రాజ్య సభ
కోసం.
అదే పార్టీతో
పని లేదు
అవకాశ వాదం.
అటు అంబానీ,
ఆదానీలు
బ్యాంకుల
అప్పుల ఎగవేతకు
కేంద్ర. ఊతం
ఒక వైపు,
ఇటు రాజ్య సభ
సీట్ల వేలం
మరో వైపు.
రాష్ట్రా లైన
కేంద్రమైన
ప్రజా ధనాన్ని
దోచుకుని
రాజకీయ దాహం,
వ్యామొహం
తీర్చుకోవడమే
నేటి పాలకుల
ప్రధాన లక్ష్యం.
అదే వారి జండా
ఎజెండా.
మేలుకో ఓటరా
మేలుకో.
Dr. నండూరి
రామకృష్ణ
07.06.2026
భారత దేశం
. ఎంత గొప్పదో".
ప్రజాస్వామ్యం లో
అతి పెద్ద దేశం
భారత దేశం.
ఓటును
అమ్ముకునే
దౌర్భాగ్యం
కలిగించింది
నా దేశం.
ప్రతీ పౌరుడు
పంచ భూతాలను
కొనుక్కోవాల్సిన
దుస్థితి మనది.
నీరు
నిప్పు
నింగి
నేల
గాలి.
నివసించే
ఇంటికి,
చేసే ఉద్యోగానికి,
పీల్చే గాలికి,
నడిపించే
వాహనానికి,
నడిచే రోడ్డుకి,
తినే తిండికి,
ఎక్కే బస్, రైలు,
విమానానికి,
వీక్షించే సినిమా,
తెలివిజన్ కు,
వేసుకునే
దుస్థులకు,
వైద్యానికి,
సంపాదించే
సొమ్ముకు
అన్నిటికీ
ప్రభుత్వ
రుసుము
చెల్లిస్తేనే కానీ,
రోజు గడవదు.
నిత్యం వాడే
నిత్యావసరాలతో
పాటు అన్నిటికీ
పన్ను చెల్లించాలి.
అందరం
భారతీయ
పౌరులమే
కానీ, కొందరికి
వీటి పై ప్రభుత్వ
వెసులు బాటు,
వ్యత్యాసాలు,
పధకాల రూపంలో
రాయతీలు
ఉచిత పంపకాలు
సముచితమా!
అనుచితమా!
ఓటును ఓటరు
అమ్ముకోవడానికి
తనకి తానుగా
ముందుకు రాడు,
ఓటు వేయించుకునే
వాడి ప్రేరణ ఉంటుంది.
ఓటును నమ్ముకున్న
వాడు ఉన్నాడు,
అదే సామాన్య
మధ్య తరగతి
వాడు, కానీ వాడి
గతి అదోగతే.
పార్టీల వారే
పార్టీ టికెట్స్ ని
వేలం వేస్తారు
అలాంటప్పుడు
ధనికుడు,
బలవంతుడికే
పోటీ చేసి గెలిచే
అవకాశం దక్కుతుంది.
ఇదే నేటి మన
మహా గొప్ప
ప్రజాస్వామ్యం.
దీనికి తోడు
కులాల వారీగా
రాజకీయ
అభ్యర్థుల
ఎంపిక.
ఇది కేవలం
రాజకీయాలకే
పరిమితం
కాలేదు,
ప్రభుత్వ
ఉద్యోగాలకి
రాజ్యాంగాన్ని
అడ్డుపెట్టుకుని
గత 80 సంవత్సరాల
నుండి
ఇదే ప్రక్రియ
మన అఖండ
భారత్ లో.
ఇటు ఉపాధి
అటు రాజకీయ
రంగ ప్రవేశం
అర్హత కు ప్రాతి
పదిక కులం
మాత్రమే
మెరిట్ తో
పని లేదు.
రాష్ట్రాలు కానీ,
కేంద్రం కానీ
ఓటు బ్యాంకు
రాజకీయాలు చేస్తూ
ప్రజలను
మభ్య పెడుతూ,
నమ్మిస్తూ,
అవాస్తవాలను,
వాస్తవాలుగా
చిత్రీకరిస్తూ
పలు పధకాలు
ఎర వేసి పాలన
సాగిస్తున్నారు
అన్నది జగద్విధితం.
Dr. నండూరి రామక్రిష్ణ
08.06.2026

Comments
Post a Comment