Skip to main content

ప్రణాళిక . ప్రగతికి చిహ్నం".

 వ్యక్తి 

వ్యక్తుల 

సమూహం 

కార్యాలయం 

కర్మాగారం 

అన్నిటి 

ఉన్నతి 

అభ్యున్నతికి 

ప్రణాళిక 

ప్రాతిపదిక.

చివరకు 

భార్య భర్తలకు 

వారు కన్న 

సంతానానికి,

వారి విద్యా 

బుద్ధులు,

ఉద్యోగం,

వివాహం 

వరకూ.

ప్రణాళిక లేని 

ప్రయాణం 

వ్యర్థం,

అనర్ధాలకు 

అలవాలం.

ఉద్యోగానికి,

వివాహానికి,

విహారాలకు,

సంతానానికి 

ప్రాణాళికే 

మూలం -

ఆధారం.

ముందుగా 

భార్య భర్తలలో 

అవగాహన 

ముఖ్యం.

అవగాహన 

ఉన్నప్పుడు 

ఒకరికి ఒకరు 

సావధానంగా 

చర్చించు 

కోవాలి.

వారి ఉన్నతి 

అభ్యున్నతి కైనా 

వారిపై ఆధార

పడ్డ తల్లి తండ్రుల

గురించి, వారు 

కన్న సంతానం 

గురించి 

నిస్వార్ధం గా 

సంభాషించు 

కోవాలి.

సమయం 

దొరకదు, కల్పించు 

కోవాలి.

ఆధార పడ్డ 

అందరి పైనా 

దృష్టి సారించాలి.

ఇక్కడ నేను 

అనుక్షణం,

దగ్గర గా చూసిన 

ఒక చిన్న 

కుటుంబం 

గురించి 

ప్రస్థావించకుండా 

ఉండలేక 

పోతున్నాను.

అదీ పరిణితి 

చెందిన 

దంపతుల 

జీవన 

ప్రస్తానాన్ని 

ఇక్కడ ఉండబట్ట 

లేక ఉదహరిస్తున్నాను.

IIT, MADRAS లో 

M. TECH. పూర్తి 

చేసుకుని, అర్హత 

తో ఉద్యోగం 

సొంతం 

చేసుకుని,

తమ్ముడు,

సోదరి 

విద్య, వివాహలకు 

సహాయ పడి,

తాను ఎటువంటి 

లాభా పేక్ష 

ఆశించకుండా 

వివాహం 

చేసుకుని,

ఎవరి వద్ద 

నుంచి ఏది 

ఆశించ కుండా 

భార్య భర్త 

లిరువురూ 

అన్యోన్య 

దాంపత్యం తో 

ఇరువురు 

బిడ్డలకు 

జన్మ నిచ్చి 

వారిని చక్కగా 

తీర్చి దిద్దుతూ,

అటు వృద్ధ 

తల్లి తండ్రులను 

ఆర్ధికంగా ఆదుకుంటూ 

అటు పిల్లలిరువురి 

కీ విద్యా బుద్ధులు 

తో పాటు సంస్కార

వOతులుగా 

తీర్చి దిద్ది,

ప్రయోజకుల్ని 

చేసి, ఎవరి ప్రమేయం లేకుండా మంచి కుటుంబం తో సంప్రదింపులు జరిపి వారి 

ఏకైక కుమార్తె 

వివాహం తానే 

జరిపి నేడు 

తాతయ్యాడు, తన సొంత ప్రణాళిక తో.

అంతే కాదు 

తన కోసం, తన 

సంతానం కోసం 

మంచి గృహాన్ని 

కూడా ఏర్పరచు 

కోవడం మరో 

మంచి ప్రణాళిక.

వారి ఏకైక 

కుమారుడు కీ 

క్యాంపస్ లోనే 

మంచి ఉద్యోగం 

వచ్చింది.

అతనిని కూడా 

వారు ప్రణాళిక 

బద్దంగా తాకుతూ,

ప్రేమాప్యాయతలు 

పంచుతూ గత 

మూడు సంవత్సరాలు గా 

తగిన ప్రోత్సాహం 

అందచేస్తూ,

అబ్బాయి పేర 

HOUSING LOAN 

కీ వెళ్లి, ఆర్ధిక 

రాజధాని మన 

హైదరాబాద్ లో 

మంచి ఏరియా 

లో ఒక విల్లా 

తీసుకుని 

ప్రణాళిక బద్దంగా 

జీవనం సాగించడం 

కొందరికే చెల్లు.

ఇటువంటి ఆదర్శ 

కుటుంబాల 

నుంచైనా చూసి 

నేర్చుకోవాలి,

ఇతరులు.

ఉన్నాం,

తిన్నాం,

కన్నాం,

నిద్రించాO 

అన్నది కాదు 

మన ప్రయోజనం.

స్వప్రయోజనం 

తో పాటు సమాజ 

ప్రయోజనం కోసం 

పాటు బడే వారే 

నిజమైన 

ప్రణాళిక బద్ధ 

మైన ఆదర్శ 

దంపతులుగా 

చరిత్రలో 

సమాజ 

హితులుగా 

కూడా 

నిలుస్తారు.


                      Dr. నండూరి రామక్రిష్ణ

                      Sr. Sub EDITOR 

                        08.06.2026

Comments