రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” ఎన్డీఏ కూటమి సభలో పాల్గొన్న ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పి. విష్ణుకుమార్ రాజు
విశాఖపట్నం:విశాఖ సందేశం వార్తలు:జూన్ 18:విశాఖ ఉత్తర నియోజకవర్గంలో “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” పేరుతో నిర్వహించిన ఎన్డీఏ కూటమి సభలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పి. విష్ణుకుమార్ రాజు గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతూ, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి సంపూర్ణ సహకారం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కృషితో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.
గత రెండేళ్లలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల సృష్టి, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విశేష పురోగతి సాధించిందని తెలిపారు. ప్రజల విశ్వాసమే ప్రభుత్వానికి బలమని, అదే నమ్మకంతో మరింత అభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
అదేవిధంగా, రాష్ట్రం అభివృద్ధి పథంలో వెనుకబడటానికి గత ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. అమరావతిలో నిర్మించిన ప్రజావేదిక కూల్చివేత, అన్న క్యాంటీన్ల మూసివేత, ఇసుక విధానంలో అవ్యవస్థలు, మద్యం విధానంలో చోటుచేసుకున్న వివాదాలు రాష్ట్ర ప్రగతికి ప్రతికూల సంకేతాలను పంపాయని పేర్కొన్నారు.
అలాగే విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎం. శ్రీభరత్ గారు మెడికల్ వ్యాన్ ద్వారా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ, అనేక వైద్య పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణకు ఆయన చేస్తున్న సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని కొనియాడారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమి సమన్వయంతో పనిచేస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం అనే ద్వంద్వ లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజల సహకారంతో మరిన్ని విజయాలు సాధిస్తామని అన్నారు.
యువ నాయకులు సునీల్ అగర్వాల్ గారు మాట్లాడుతూ ఉత్తర నియోజకవర్గం లో కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండాలనిమనం ఇలానే ముందుకు సాగాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ పట్టాభిరామ్ గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ రామారావు గారు, టీడీపీ నాయకులు శ్రీ కిమిడి మల్లిక్ నాయుడు గారు, శ్రీ సురేష్ బాబు గారు, శ్రీ కోయిలాడ వెంకటేష్ గారు, బీజేపీ యువ నాయకులు శ్రీ సునీల్ అగర్వాల్ గారు, శ్రీమతి సుహాసిని ఆనంద్ గారు, శ్రీమతి సుజాత గారు, శ్రీ శ్రీధర్ గారు, శ్రీ పృథ్వీరాజ్ గారు, శ్రీ శివాజీ గారు, శ్రీ ముత్యాల నాయుడు గారు, శ్రీ సత్యనారాయణ గారు, శ్రీమతి మల్లా లక్ష్మి గారు, శ్రీ మోహన్ గారితో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




Comments
Post a Comment