. K.V.SHARMA EDITOR
విశాఖపట్నం: విశాఖ సందేశం: 10 జూన్ ,గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ మరియు పీజీ కోర్సుల (స్వయంప్రతిపత్తి) కళాశాల సమావేశ మందిరంలో ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో “ఉత్తమ సంబంధాలకై సాఫ్ట్ స్కిల్స్ ప్రాధాన్యత” (Significance of Soft Skills for Good Relationships) అనే అంశంపై పాఠశాల, కళాశాల విద్యార్థులతో పాటు సాధారణ ప్రజల అవగాహన కోసం ఉచితంగా (రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా) నిర్వహిస్తున్న ఈ కార్యశాల మూడు రోజుల సమ్మర్ వర్క్‌షాప్ ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ విద్యావేత్త, ఆంగ్ల విభాగాధిపతి మరియు పీజీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డా. ఎన్. సోలమన్ బెన్నీ గారు మాట్లాడుతూ, నేటి ఆధునిక సమాజంలో వ్యక్తిగత, వృత్తిపరమైన విజయ సాధనలో సాఫ్ట్ స్కిల్స్ (మృదు నైపుణ్యాలు) ఎంతటి కీలక పాత్ర పోషిస్తాయో వివరించారు. ఎదుటివారితో మాట్లాడే విధానం, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, సానుకూల దృక్పథం ద్వారా సమాజంలో ఉత్తమమైన, బలమైన మానవ సంబంధాలను ఎలా పెంపొందించుకోవచ్చో ఉదాహరణలతో విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
గాయత్రి విద్యా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ దక్షిణామూర్తి గారు మాట్లాడుతూ, విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా ఇటువంటి వర్క్‌షాప్‌లను సద్వినియోగం చేసుకొని తమ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ఆకాంక్షించారు.
కళాశాల పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO) శ్రీమతి శేషపద్మ గారు మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా సాఫ్ట్ స్కిల్స్ ప్రతి ఒక్కరికీ అత్యావశ్యకమని, ముఖ్యంగా యువత తమ వ్యక్తిత్వ వికాసానికి ఇవి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి శ్రీ కె. శంకర్ రావు వ్యాఖ్యాతగా వ్యవహరించగా, ఆంగ్ల విభాగాధిపతి డా. జి. విజయలక్ష్మి గారు అందరికీ స్వాగతం పలికి, వర్క్‌షాప్ ముఖ్య ఉద్దేశాలను వివరించారు. అనంతరం ముఖ్య అతిథిని సభకు పరిచయం చేశారు.
కార్యక్రమం ముగింపులో శ్రీమతి వేదవతి వందన సమర్పణ (Vote of Thanks) చేశారు.
ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. ఎస్. బోస్ , కళాశాల డైరెక్టర్ (UG ప్రోగ్రామ్స్) శ్రీ డి. గిరిధర్, గారి సలహా, సంప్రదింపులతో నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా. సౌజన్య (ఆంగ్ల విభాగం), డా. రాధిక (గణిత విభాగాధిపతి), డా. శ్యామల (మైక్రోబయాలజీ విభాగం), డా. ఇలాహి (బయోకెమిస్ట్రీ విభాగాధిపతి), డా. అనిత (హిందీ విభాగం), శ్రీమతి విజయలక్ష్మి (కంప్యూటర్ సైన్స్ విభాగం) తదితరులు పాల్గొన్నారు. అలాగే వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన సుమారు 50 మంది విద్యార్థులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు

Comments
Post a Comment