Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. సింహాచల క్షేత్రంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న ఒడిశా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శిబో శంకర్ మిశ్రా.

.              K.V.SHARMA EDITOR 
సింహాచలం, ఆదివారం, జూన్ 14, 2026: ఆదివారం, ఒడిశా హైకోర్టు గౌరవనీయులైన న్యాయమూర్తి జస్టిస్ శిబో శంకర్ మిశ్రా  తమ కుటుంబ సభ్యులతో కలిసి  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు.


ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు జస్టిస్ శిబో శంకర్ మిశ్రా కి వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం, ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆయనను శేష వస్త్రంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆలయ సహాయ కార్య నిర్వహణ అధికారి కె. తిరుమలేశ్వరరావు  జస్టిస్ శిబో శంకర్ మిశ్రా గారికి స్వామివారి ప్రసాదాలను, జ్ఞాపికగా స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

Comments