పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాద ఘటనపై అనకాపల్లి ఎంపీ దిగ్భ్రాంతి* *క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి.. సహాయక చర్యలు వేగవంతం చేయాలి* *మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించిన రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సిఎం రమేష్*
K.V.SHARMA EDITOR
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని దక్షిణ్ ఎనర్జీ సంస్థలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం. రమేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా అధికారుల ద్వారా తెలుసుకుని సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను కోరారు.క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని సూచించారు.ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి సారించి జిల్లా అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, అవసరమైన సహాయ చర్యలు చేపట్టేందుకు సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments
Post a Comment