Skip to main content

శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం. దేవస్థాన పంచగ్రామాల ప్రజలకు ముఖ్య సూచనలు

K.V.SHARMA EDITOR 
చిరకాలముగా దేవస్థానం భూముల్లో ఇల్లు కట్టుకొని నివసిస్తున్న గృహములకు మరమ్మతుల అనుమతులపై మార్గదర్శకాలు.

* పాత ఇళ్లకు అవసరమైన స్వల్ప మరమ్మతులు (మైనర్ రిపేర్లు) నిర్వహించుకోవడానికి మాత్రమే దేవస్థానం అనుమతులు మంజూరు చేస్తుంది.

* ఇంటి నిర్మాణ స్వరూపాన్ని మార్చే విధమైన ఎటువంటి మాడిఫికేషన్లు, విస్తరణలు లేదా కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇవ్వబడవు.

2 దరఖాస్తుల స్వీకరణ

* స్వల్ప మరమ్మతులు చేపట్టాలనుకునే వారు దేవస్థానం ఏర్పాటు చేసిన ల్యాండ్ గ్రీవెన్స్ సెల్ లో దరఖాస్తు చేసుకోవాలి.

* గ్రీవెన్స్ సెల్ దేవస్థానం టీటీడీ సత్రంలో పనిచేస్తుంది.

దరఖాస్తులు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు స్వీకరించబడతాయి.

3. దరఖాస్తుతో జతపరచవలసిన పత్రాలు

* పూర్తి చేసిన దరఖాస్తు ఫారం.

* దేవస్థానం అందజేసే హామీ పత్రం (అండర్‌టేకింగ్).

* ఇంటి ప్రస్తుత పరిస్థితిని చూపించే ఫోటోలు.

* హౌస్ ట్యాక్స్ రసీదులు, కరెంట్ బిల్లు,లు

* ఆధార్ కార్డు జిరాక్స్.

4. పరిశీలన ప్రక్రియ

దరఖాస్తు అందిన తర్వాత సుమారు 7 నుండి 10 రోజులలోపు దేవస్థానం టెక్నికల్ టీం, నాన్-టెక్నికల్ టీం మరియు ప్రత్యేక కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహిస్తారు.

దరఖాస్తులో పొందుపరిచిన వివరాలు, వాస్తవ పరిస్థితులను పరిశీలించిన అనంతరం మాత్రమే అనుమతి లేదా తిరస్కరణపై నిర్ణయం తీసుకోబడుతుంది.

5. అనుమతుల ఉల్లంఘనపై చర్యలు

దేవస్థానం మంజూరు చేసిన అనుమతులకు విరుద్ధంగా ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు.

మైనర్ రిపేర్ల పేరుతో కొత్త నిర్మాణాలు, అదనపు గదులు, అంతస్తులు లేదా ఇతర శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్లయితే వాటిని చట్టపరమైన చర్యల అనంతరం వెంటనే తొలగిస్తారు.

ఇటువంటి అక్రమ నిర్మాణాలను దేవస్థానం ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ ద్వారా తొలగించబడుతుంది.

6. ప్రజలకు విజ్ఞప్తి

దేవస్థాన భూముల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.

పంచగ్రామాల ప్రజలు నిబంధనలను పాటిస్తూ దేవస్థానానికి సహకరించాలి.

అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు లేదా భూ వినియోగ మార్పులకు పాల్పడకుండా జాగ్రత్త వహించాలి.



— జల్లేపల్లి వెంకట్రావు కార్యనిర్వహణాధికారి 

శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం :::

Comments