శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం. సింహాచలంలో స్వామివారిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్
K.V.SHARMA EDITOR
సింహాచలం, 10జూన్ :ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ బుధవారం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పరశురామ్, సురేంద్ర, దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఆలయానికి విచ్చేసిన పి.వి.ఎన్. మాధవ్‌కు దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు సాదర స్వాగతం పలికారు.
అనంతరం ప్రధా న అర్చకులు సీతారామాచార్యులు, వేద పండితులు నాదస్వర మంగళవాద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా స్వాగతించారు. ముందుగా సంప్రదాయానుసారం స్వామివారి కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న పి.వి.ఎన్. మాధవ్, అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని
దర్శనానంతరం వేద పండితులు వేదఘోషల మధ్య ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి ప్రసాదాలు మరియు స్వామివారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు.


Comments
Post a Comment