Skip to main content

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు*

.                       కె. వి. శర్మ, ఎడిటర్,
విశాఖపట్టణం: విశాఖ సందేశం
:లోకసభ ప్రతిపక్ష నేత  రాహుల్ గాంధీ 56 వ జన్మదిన వేడుకలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ఆధ్వర్యంలో జెన్ జీ యువత  ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. ప్రియాంక మాట్లాడుతూ రాహుల్ గాంధీ మీద యువతరం నమ్మకం పెట్టుకున్నారని, ఆయన ప్రధాని అయితేనే నీట్ విద్యార్థులకు న్యాయం జరుగుతుందని, ఉపాధి అవకాశాలు లభిస్తాయని యువత విశ్వసిస్తున్నారని ఆమె అన్నారు. విద్యావంతుడు ఈ దేశ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రియాంక అన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాండవ గాయత్రి మరియు ప్రొఫషనల్ కాంగ్రెస్ చైర్మన్ డా. విజయ్ చంద్రా,28 వ వార్డు అధ్యక్షుడు గుర్రం కనకరాజు, 20 వ వార్డు అధ్యక్షులు భోగవరపు శ్రీనివాస్, ఆంధ్ర విశ్వ విద్యాలయం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Comments