Skip to main content

విశాఖ జిల్లా, భీమిలి నియోజకవర్గం,ఆనందపురం గ్రామంలోని ఎంపీడీవో ఆఫీస్ ఏసీ ఆడిటోరియంలో కిసాన్ మోర్చా విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ పొట్నూరు వెంకట కృష్ణారావు గారి ఆధ్వర్యంలో "సేంద్రియ వ్యవసాయ రైతు సదస్సు" అత్యంత ఘనంగా నిర్వహించబడింది.

.          K.V.SHARMA  EDITOR 
విశాఖ జిల్లా: విశాఖ సందేశం వార్తలు: గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 12 సంవత్సరాల సుపరిపాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ
సమావేశాన్ని భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు పొట్నూరు వెంకట కృష్ణారావు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని పురాతన పద్ధతిలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఫెర్టిలైజర్స్ మరియు క్రిమిసంహారిక మందులు వాడకం తగ్గిస్తూ గో ఆధారిత, పెంట గుత్తామ, చెరువు మట్టి లాంటివి వాడి భూసార రక్షణ చేసి సేంద్రియ  ఉత్పత్తులు తయారు చేయమని రైతులకు తెలియజేయడమైనది


ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ (BJP) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీ చిగురుపాటి కుమార్ స్వామి గారు మరియు బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి,రైతులకు సేంద్రియ వ్యవసాయంపై కీలక అవగాహన కల్పించారు.


భారతీయ జనతా పార్టీ (BJP) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీ చిగురుపాటి కుమార్ స్వామి గారు మాట్లాడుతూ గడిచిన 12 సంవత్సరాలలో మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి,రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి అనేక విప్లవాత్మక పథకాలను కేంద్రం ప్రవేశపెట్టిందని చెప్పారు. ఇందులో భాగంగా 


1. సేంద్రియ & ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీటపరంపరాగత్ కృషి వికాస్ యోజన (PKVY): దేశంలో రసాయన రహిత, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి క్లస్టర్ పద్ధతిలో రైతులకు ఆర్థిక సహాయం మరియు శిక్షణ అందించడం.


భారతీయ ప్రకృతి కృషి పద్ధతి (BPKP): సాంప్రదాయ పద్ధతుల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ,పెట్టుబడి ఖర్చులను తగ్గించడం


2. ప్రత్యక్ష ఆర్థిక సహాయంపీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN): దేశంలోని కోట్ల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం రూ.6,000 నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం.


3. పంట భద్రత & మార్కెటింగ్ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY): అతి తక్కువ ప్రీమియంతో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు పూర్తి పంట భీమా రక్షణ కల్పించడం.ఇ-నామ్ (e-NAM - National Agriculture Market): రైతులు తమ పంటను దేశంలో ఎక్కడైనా సరైన ధరకు అమ్ముకునేలా డిజిటల్ మార్కెట్ వేదికను సృష్టించడం.


4. భూసార రక్షణ & మౌలిక వసతులుసాయిల్ హెల్త్ కార్డ్ (Soil Health Card): మట్టి నాణ్యతను పరీక్షించి, భూమికి ఏ ఎరువులు ఎంత మోతాదులో కావాలో రైతులకు అవగాహన కల్పించడం.

పీఎం కృషి సించాయి యోజన (PMKSY): "హర్ ఖేత్ కో పానీ" మరియు "పర్ డ్రాప్ మోర్ క్రాప్" ద్వారా ప్రతి పొలానికి నీరు,సూక్ష్మ నీటి పారుదల (డ్రిప్, స్ప్రింక్లర్) ప్రోత్సహించడం జరిగిందని చెప్పారు.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చ ఇంచార్జ్ పాకాల పాటి రవి రాజు కిసాన్ మోర్చ రాష్ట్ర ప్రధాన  కార్యదర్శి ఎస్.వి.సుబ్బారావు కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్,జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి దానేశ్వరరావు,జిల్లా ఉపాధ్యక్షులు కైలాష్ రెడ్డి,రాష్ట్ర కౌన్సిల్  మెంబర్ ఉప్పాడ అప్పారావు జిల్లా కార్యదర్శి కే.సునీత,మాజీ అసెంబ్లీ కన్వీనర్ కె.రామానాయుడు, ఆనందపురం మండలం ఇంచార్జి కె.ఎన్.పి.చక్రవర్తి కిసాన్ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శిలు డి.రామ కృష్ణ రాజు,డి.పి.రాజు,కిసాన్ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి పల్లి శ్రీను,బసవ అప్పలనాయుడు సారిక ప్రకాష్,హంష మహేష్, చిరికి సత్యనారాయణ కొలుసు శ్రీను,జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు వర్షం వెంకట్,జిల్లా మహిళా మోర్చ ట్రెజరర్ మాద బత్తుల బుజ్జి ఆనందపురం మండల పద్మ నాభం పార్టీ మండల అధ్యక్షురాలు పిల్లా విజయ,టమాటపు నాగమణి, నిమ్మకాయల అప్పల రాజు,పిల్లా చిన్నారావు, సేంద్రియ వ్యవసాయ శాఖ డిపిఎం మోహనరావు పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు సేంద్రియ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా విశాఖ జిల్లా అధ్యక్షులు పొట్నూరు వెంకట కృష్ణారావు తెలియజేశారు.

Comments