Skip to main content

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన మెడికవర్ హాస్పిటల్స్ విశాఖపట్నం*

                          కె. వి. శర్మ, ఎడిటర్,


విశాఖపట్నం :విశాఖ సందేశం వార్తలు: జూన్ 21:అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, విశాఖపట్నంలో ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.  

ఈ కార్యక్రమంలో యోగా ట్రైనర్ శిల్ప ఆధర్యంలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆసుపత్రి ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని యోగా సాధన చేశారు.

డా. కరుణాకర్ పాడి  మాట్లాడుతూ, "యోగ అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వరం. ప్రతిరోజూ కొంత సమయం యోగా కోసం కేటాయించడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా పొందవచ్చు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి" అని అన్నారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ, యోగా శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మానసిక ప్రశాంతతను, భావోద్వేగ సమతుల్యతను అందిస్తుందని తెలిపారు. ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి జీవనశైలి వ్యాధులను నియంత్రించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా  ప్రజలందరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని మెడికవర్ హాస్పిటల్స్ సెంటర్ హెడ్ డా. అరుణ్ కుమార్  పిలుపునిచారు

Comments