విశాఖపట్నం: విశాఖ సందేశం న్యూస్తె :తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (తెలుగు మా)" 3వ వార్షికోత్సవ పోస్టర్ ను ప్రముఖ నటుడు, దర్శకుడు, సత్య ప్రకాష్, శనివారం నగరంలో మేఘాలయ హోటల్ లో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా భవిష్యత్ లో అసోసియేషన్ కళాకారుల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమ వివరాలను తెలుగు మా అసోసియేషన్, ఉపాధ్యక్షుడు, ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జ్, ఎం.కృష్ణకిషోర్, నటుడు సత్య ప్రకాష్ కు వివరించారు. రాష్ట్రంలో కళాకారుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికై "తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్" ఆంధ్రప్రదేశ్) లో ఏర్పాటు చేయడం అభినందనీయమని నటుడు సత్య ప్రకాష్ కొనియాడారు! కళాకారుల సంక్షేమానికి తన సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు! తెలుగు-మా అసోసియేషన్ (ఆంధ్రప్రదేశ్) వ్యవస్థాపక అధ్యక్షుడు, డా||పూతి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఈ జూన్, నెల 27న విజయవాడ, గవర్నర్ పేట, రాఘవయ్య పార్క్, ఎదురుగా బాలోత్సవ భవన్ వేదికగా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది వరకు "తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (ఆంధ్రప్రదేశ్) 3వ వార్షికోత్సవం జరుగుతుందన్నారు! ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలకు 9949114919, 7981722023, 7330949072, 8985566770, 8555919166, 9100775857, 9346717615 నంబర్లకు సంప్రదించాలని అధ్యక్షుడు, డా||పూతి వెంకటరెడ్డి కోరారు, కార్యక్రమంలో కార్య నిర్వాహక కార్యదర్శి, వై.రాజశేఖర్, అసోసియేషన్ ప్రతినిధులు ఈశ్వర్, రాజు, శేఖర్, సాయి సంతోష్ పాల్గొన్నారు.

Comments
Post a Comment