Skip to main content

బస్టాండ్లో ఆకాతాయిలకు చుక్కలు చూపించిన ఎస్ఐ శ్రీనివాస్......

.              SRINIVAS SPL Correspondant 
అమలాపురం. విశాఖ సందేసం..డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాలతో డిఎస్పీ  టి.ఎస్.ఆర్. కె ప్రసాద్ పర్యవేక్షణలో  జిల్లా కేంద్రం  అమలాపురం  బస్టాండ్ లో ఆకాతాయిలకు అమలాపురం ఎస్.ఐ టి. శ్రీనివాస్ మంగళవారం సాయంత్రం చుక్కలు చూపించారు. 


బస్టాండ్ లో మద్యం సేవించిన ఆకాతాయి యువకులు  దూర  ప్రాంతాలకు వెళ్లే  ప్రయాణికులు కూర్చుని విశ్రాంతి తీసుకునే సమయం కుడా  ఇవ్వకుండా ముఖ్యంగా మహిళలకు, వృద్దులకు ఇబ్బంది కలిగే విధంగా కుర్చీలలో మద్యం మత్తులో పడుకుంటున్నారు. ఇదే సమయంలో  ఎస్. ఐ టి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు బస్టాండ్ లో రంగ ప్రవేశం చేసి కుర్చీలలో పడుకున్న వ్యక్తులను ఒక్కరిని లాఠీతో బెదిరించి, వారి వివరాలను అడిగి అక్కడి నుండి వెళ్లగొట్టారు. ఈ కార్యక్రమం ఎస్ఐ వెంట పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments