రొయ్యల కొనుగోళ్లపై కమిటీ వేయాలంటూ ఆక్వా రైతుల విజ్ఞప్తి.. కోనసీమ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన ఆక్వా రైతులు
. Srinivas SPL Correspondant
అమలాపురం, విశాఖ సందేసం...ఆక్వా రంగంలో ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో ఆక్వా రైతులకు అనుకూలంగా రొయ్యల మేతల ధరల పెంపుపై కమిటీ వేసినట్లే ఆరుగాలం శ్రమించి పండించిన పంట రైతులు నష్టపోకుండా విక్రయించుకునేందుకు ప్రభుత్వం కమిటీ వేయాలని ఆక్వా రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డా. బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు దెందుకూరి సత్తిబాబు రాజు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల వేదికకు తరలివచ్చిన ఆక్వారైతులు ఆక్వా మేతల ధరల విషయంలో ప్రభుత్వం కమిటీ వేసినట్లే రొయ్యల కోనుగోళ్లు, ప్రాసెసింగ్, ఎక్స్‌పోర్ట్‌ల విషయంలో కూడా కమిటీ వేసి ఎక్స్‌పోర్ట్ రేట్ల ప్రకారం రైతులకు ధరలు నిర్ణయించాలని కలెక్టర్‌ను కోరారు. రైతుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, రైతులకు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విద్యుత్తు సబ్సిడీ విషయంలో ప్రయోజనం కలగాలంటే మేతల ధరల విషయంలో కమిటీ వేస్తూ నిర్ణయం తీసున్నట్లే ఎక్స్‌పోర్ట్ ధరలనే అమలు అయ్యేలా కమిటీ వేయడం ద్వారా ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు. ఈకార్యక్రమంలో ఆక్వా సంఘం జిల్లా కార్యదర్శి త్సవటపల్లి మణికుమార్, సాధనాల గోవింద్, ఒంటెద్దు సీతారామయ్య, ఈసకోన సాంబశివరావు, కాయల బలరామ్, అక్కల బాలకృష్ణ, త్సవటపల్లి హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment